జగన్ మీటింగ్.. అదే పాత సుత్తి..!

Publish Date:Jun 21, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే పాతకాలం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే, అధికారం పోయిన దగ్గర్నుంచీ ఆయన భారీగా సుత్తి కొడుతున్నారు. వేసిన రికార్డే వేస్తున్నారు. చెప్పిందే చెప్పి బుర్ర తింటున్నారు. అధికారం పోగానే ఏర్పాటు చేసిన మీటింగ్‌‌లో ఏం మాట్లాడారో విన్నారుగా. వాళ్ళకి ఇన్ని కోట్లు పంచాను ఆ ప్రేమ ఏమైందో.. వీళ్ళకి ఇన్ని కోట్లు పంచాను.. వీళ్ళ ప్రేమ ఏమైందో.. అంటూ సుదీర్ఘ  సుత్తికొట్టారు. పులివెందులలో ఈయన ఆస్తులు అమ్ముకొచ్చి ఆ డబ్బు పంచారు కాబట్టి ఈయన ఏమి చేసినా జనం ఈయన్ని ప్రేమించాలి. మరోసారి గెలిపించాలి.. అదీ ఈయన బాధ! ఆమధ్య ఓడిపోయిన ఎమ్మెల్యేలతో, నాలుగైదు రోజుల క్రితం ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే సుత్తి. డబ్బులు పంచాను.. వాళ్ళ ప్రేమ ఏమైంది.. డబ్బులు పంచాను... వీళ్ళ ప్రేమ ఏమైంది...!

లేటెస్ట్.గా గురువారం (20-06-24) నాడు పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా అయన డబ్బు పంచాను.. బటన్ నొక్కాను.. హోమ్ డెలివరీ చేశాను.. ఆ ప్రేమంతా ఏమైంది అని చెప్పిందే చెప్పి బుర్ర వాచిపోయేలా చేశారు. ఈ మీటింగ్‌కి వచ్చిన నాయకులంతా, తామెందుకు ఓడిపోయారో అర్థంకాక బుర్ర హీటెక్కిపోయి వుంటే, ఇక్కడ కూడా ఈయన ఆ ప్రేమంతా ఎటు పోయిందో అని తగులుకుంటే ఎంతసేపని భరించగలరు? అందుకే మీటింగ్‌కి వచ్చిన నాయకులు చాలామంది, ఈయన సుత్తి త్వరగా ముగిస్తే పారిపోదాం దేవుడా అని ఎదురుచూశారని సమాచారం.

జగన్ సారు మీటింగ్ పెడుతున్నారూ అంటే, మనం ఈ ఐదేళ్ళ కాలంలో ఈ తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకుందాం అని చెప్తారని చాలామంది అనుకున్నారు. కానీ, ఇప్పటికీ తామేం తప్పు చేయలేదనే భ్రమల్లోనే బతుకుతున్న తమ నాయకుడిని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో సీనియర్ నాయకులు వున్నారు. మనం చాలా తప్పులు చేశాం.. వాటిని ఇలా సరిదిద్దుకోవాలి అని జగన్ ముందు నిలబడి మట్లాడే సినిమా ఏ నాయకుడికీ లేదు మరి. అందుకే, మీటింగ్ జరుగుతున్నంత సేపూ తమలో తామే కుమిలిపోతూ, ఆ తర్వాత బయటపడ్డారని సమాచారం. జగన్ మీటింగ్ అని అందర్నీ పిలిపించారు. కానీ స్పీచ్ ఇచ్చి పంపించేశారు. మీటింగ్ అంటే ఏమిటీ...? ఒక డిస్కషన్‌లాగా జరగాలి... కానీ జగన్ విషయంలో జరుగుతున్నది మీటింగ్ కాదు... కేవలం జగన్ స్పీచ్ మాత్రమే. ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పులు చేస్తుంది.. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అని చేతగాని మాటలు చెప్పడమే. వాళ్ళు తప్పులు చేస్తే మనం అధికారంలోకి వస్తామనే తప్ప.. మనం ఈ మంచి పనులు చేద్దాం.. అధికారంలోకి వద్దామనే మాట జగన్ నోటి వెంట రావడం లేదని వైసీపీ నాయకులు తలలు బాదుకుంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.