కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ

Publish Date:Aug 5, 2022

Advertisement

జనాన్ని కలుసుకుంటే నిరసనలు ఎదుర్కొనవలసి వస్తుందని భావిస్తున్న జగన్ జనంలోకి వెళ్లడం కంటే పార్టీ కార్యకర్తలను తన వద్దకు పిలిపించుకుని వారిని ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీ గెలుపునకు కెటలిస్టులుగా మార్చాలని యోచిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలకు శ్రీకారం చుట్టారు.   ఆయన కుప్పం కార్యకర్తలతోనే ఆయన ఈ భేటీలకు శ్రీకారం చుట్టారు. విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలను ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిపించుకుని వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

తెలుగుదేశం అధినేత సొంత నియోజకవర్గంలో ఆయనను ఓడించగలిగితే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అన్న లక్ష్యం సునాయసంగా సాధించగలమని జగన్ కార్యకర్తలకు తెలిపారు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో వైసీపీ విజయంతో అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి బీజాలు పడ్డాయని జగన్ వారితో అన్నారు. అదే ఉత్సాహంతో ముందుకు సాగి అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి పరాభవం ఎదురయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు.

మరో సారి వచ్చే ఎన్నికలలో 175కు 175స్థానాలలోనూ మనదే విజయం అంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. గడపగడపకూ మన ప్రభుత్వం వైఫల్యం, మంత్రల బస్సుయాత్రకు ఎదురైన పరాభవం వీటిని వేటినీ ఆయన కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ సమస్యలే లేవని, జనం అంతా వైసీపీవైపే ఉన్నారనీ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నమే తప్ప, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, జనాలను ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్యలు కానీ, హామీల అమలులో వైఫల్యాలు గానీ ఈ భేటీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాలేదు. మనం గెలుస్తున్నాం.. గెలవాలంతే అన్న ధోరణిలోనే కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ సాగిందని విశ్వసనీయంగా తెలిసింది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.