ఏబీవీపై కేసు సరే.. జగన్, విజయసాయిలను ఏం చేయాలి?

Publish Date:Jan 23, 2025

Advertisement

కిందపడ్డా మాదే పై చేయి. మేం ఎవర్నైనా ఏదైనా అంటాం.. మమ్మల్ని అంటే మాత్రం సహించం. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా, చివరికి బూతులు తిట్టినా తప్పు కాదు..  అదే మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది తప్పు. క్షమించరాని నేరం. ఇదీ మొదటి నుంచీ వైసీపీ నేతల తీరు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిస‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు. కులాల పేరుతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప‌లానా కులాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి వెలివేయాల‌ని అనొచ్చు . వారు ఏద‌న్నా క‌రెక్ట్ అంటూ స‌మ‌ర్ధించుకుంటారు. కానీ, వారి  వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తే మాత్రం త‌ట్టుకోలేరు. వారి సొంత‌ మీడియా , పార్టీ సోష‌ల్ మీడియా ద్వారా అదే ప‌నిగా అస‌త్యాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను, ఏపీలోని క‌మ్మ‌ సామాజిక వ‌ర్గాన్ని పురుగుల్లా చూసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నారు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపిన వారికి శిక్షలు  వేయాలంటూ సొంత మీడియా ద్వారా రోత రాత‌లు రాయిస్తున్నారు. ఇంత‌కీ  అస‌లేం జ‌రిగింది.. కుల ప్ర‌స్తావ‌న ఇప్పుడెందుకు తేవాల్సి వ‌చ్చిందీ అంటే..

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో 2019 నుంచి 2024 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటినుంచి ఏపీలోని క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని రాష్ట్రం నుంచి వెలివేయ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్లుగా  ప‌నిచేశారు. ఈ ప్ర‌క్రియ ఐదేళ్ల పాటు సాగింది. ఇది ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారుల‌పై జ‌గ‌న్ చిన్న‌చూపు చూస్తూ వ‌చ్చారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు అధికారుల‌పై కేసులు పెట్టించారు. క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ అడ్డుకుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం కుట్ర చేస్తుందంటూ ప్ర‌చారం చేయించారు. మ‌రీ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వ్యాక్సిన్ క‌నుక్కుంటే దానిపైనా వారి పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. అది క‌రోనా వ్యాక్సిన్ కాదు.. క‌మ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం వారి నీచబుద్ధికి పరాకాష్ట‌. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావునైతే ముప్పుతిప్ప‌లు పెట్టారు. కేవ‌లం క‌మ్మ కులానికి చెందిన వ్యక్తి అన్నఅక్క‌స్సుతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఇది బహిరంగ ర హస్యమే.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. కానీ, అధికార బ‌లంతో అంద‌రి నోర్లు మూయించారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికితోడు ఆ పార్టీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారంలో ఉన్నంత‌కాలం ప్ర‌తీరోజూ ఉద‌యం, సాయంత్రం క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని తిట్ట‌డ‌మే ఆయ‌న ప‌నిగా పెట్టుకున్నారు. ఏపీలో క‌మ్మోళ్లు ఎవ‌రూ బిజినెస్ లు చేసుకోవ‌ద్దు.. ఆ సామాజిక వ‌ర్గంవారు మీడియా సంస్థ‌లు న‌డ‌పొద్దు.. అస‌లు వారు రాష్ట్రంలో ఉండొద్దు అన్న‌ట్లుగా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వీరి వెకిలి చేష్ట‌ల‌ను భ‌రించ‌లేని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పారు. వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా..  మీ నిర్వాకం ఐదేళ్లు భరించాం. ఇక చాలు అంటూ ఓటుతో గుణపాఠం చెప్పారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అనేక‌ సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ, ఏ సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న విమ‌ర్శించలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అన్ని సామాజిక వ‌ర్గాల వారికి మేలు జ‌రిగింది. అన్ని సామాజిక వ‌ర్గాల వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ  జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా  ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో  క‌క్షా రాజ‌కీయాలు కొన‌సాగాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. జ‌గ‌న్ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై ఏవిధంగా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారో పూసగుచ్చినట్లు వివ‌రించారు. వైసీపీ హయాంలో  తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాలను వివరించారు.  

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ సొంత మీడియా  తనకు మాత్రమే సాధ్యమైన వక్రభాష్యంతో హైలైట్ చేసింది. నిజాల‌ను ఒప్పుకోకుండా ఏబీపై విమ‌ర్శ‌ల దాడిచేసింది. అలాగే, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌లు చూసి ఎవ‌రైనా దాడుల‌కు దౌర్జ‌న్యాల‌కు దిగితే ప‌రిస్థితి ఏంటి అంటూ  బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీనికితో డు పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌నే డిమాండ్ ను కూడా  లేవ‌నెత్తింది. అయితే, జ‌గ‌న్ మీడియా గుర్తించాల్సిన అస‌లు విష‌యం మాత్రం ఇప్ప‌టికీ గుర్తించ‌డం లేదు. దీంతో వైసీపీ మీడియా తీరును  గురువింద సామెత‌ను గుర్తు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జ‌గ‌న్ మీడియా అన్న‌ట్లు కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసులు పెడితే.. మరి జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి, ఆ పార్టీలోని కొంద‌రి నేత‌ల‌పై ఎన్ని కేసులు పెట్టాలి..?  ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సి వస్తే..గతంలో జగన్, విజయసాయి, ఇతర వైసీనీ నేతల వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు వారిని ఉరి తీయాల్సి ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతోంది.  కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీపై కేసులు పెట్టాల‌ని కోరిన జ‌గ‌న్ మీడియా.. మ‌రి జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డిపై ఏఏ కేసులు పెట్టాలో కూడా చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.