Publish Date:Feb 18, 2025
జగన్ సంయమనం కోల్పోయారు. ఆయన నోటి నుంచి ఏం మాట వస్తోందో కూడా ఆయనకు అర్ధం కావడం లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయి ముందువెనుకలాలోచించకుండా, పర్యవసానం ఎలా ఉంటుందన్న ఎరుక లేకుండా నోరు పారేసుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన కేబినెట్ సహచరులలో ఎక్కువ మంది నోటి వెంట బూతులు వినా మరో మాట వచ్చేది కాదు. జగన్ అటువంటి వారిని ప్రోత్సహించి, అందలం ఎక్కించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జగన్ తరఫున ప్రత్యర్థులపై నోరు పారేసుకుని బూతుల పంచాగంతో విరుచుకుపడటానికి ఆయన పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడం ఏమిటి.. ఆసలు ఆయన పొడే గిట్టదన్నట్లుగా పార్టీని వీడిపోతున్నారు. సోషల్ మీడియాలో రోత పోస్టులతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పేసి తాను చాలా మంచి వాడిననీ, జగనే తనను బెదరించి, ఒత్తిడి చేసి అటువంటి అసభ్య పోస్టులు పెట్టించారనీ, ఆయన ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేయించారనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
దీంతో ఇక తాను చెప్పినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసే వారెవరూ పార్టీలో లేకుండా పోయారు. ఉన్న రోజా, కొడాలి నాని వంటి వారు మైకులను తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో వేరే గత్యంతరం లేక జగనే స్వయంగా రంగంలోకి దిగిపోయారా? బూతుల పంచాంగం తెరిచేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మేము ఎవర్ని ఏమన్నా తప్పులేదు.. మీరు అంటే మాత్రం తప్పు..! క్షమించరాని నేరంకూడా అన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నిజానికి మొదటి నుంచి వైసీపీ నేతల తీరు ఇదే.
జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఎవరినైనా ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చు. అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీల నేతల పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన జగన్, ఆయన పార్టీ నేతలూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా అధికార మదంతో తెలుగుదేశం కూటమి చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామనీ అప్పుడు ఇంతకింతా అనుభవించేలా చేస్తామనీ హెచ్చరికలు చేస్తున్నారు. విజయవాడ జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హెచ్చరికలే చేశారు. తెలుగుదేశం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్.. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది వైసీపీయే అని జోస్యం చెప్పారు. అలా చెప్పి ఊరుకోకుండా.. పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు.
తెలుగుదేశం నేతలకు సెల్యూట్ చేస్తూ, వారి కోసం పని చేసే పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలనూ వదిలిపెట్టేది లేదన్నారు. ఏడు సముద్రాల అవతలదాగినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. అటువంటి పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను బట్టలూడదీసి నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీసి నిలబెడతా అన్న వ్యాఖ్యలు జగన్ ను కచ్చితంగా ఇరుకున పెడతాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైనా ఆశ్చర్యం ఉండదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-lost--restraint-39-193059.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.