కొడాలి నానిలా మారిపోతున్న జగన్మోహన్ రెడ్డి

Publish Date:Feb 18, 2025

Advertisement

జగన్ సంయమనం కోల్పోయారు. ఆయన నోటి నుంచి ఏం మాట వస్తోందో కూడా ఆయనకు అర్ధం కావడం లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయి ముందువెనుకలాలోచించకుండా, పర్యవసానం ఎలా ఉంటుందన్న ఎరుక లేకుండా నోరు పారేసుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన కేబినెట్ సహచరులలో ఎక్కువ మంది నోటి వెంట బూతులు వినా మరో మాట వచ్చేది కాదు. జగన్ అటువంటి వారిని ప్రోత్సహించి, అందలం ఎక్కించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జగన్ తరఫున ప్రత్యర్థులపై నోరు పారేసుకుని బూతుల పంచాగంతో విరుచుకుపడటానికి ఆయన పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడం ఏమిటి.. ఆసలు ఆయన పొడే గిట్టదన్నట్లుగా పార్టీని వీడిపోతున్నారు. సోషల్ మీడియాలో రోత పోస్టులతో  ఇష్టారీతిగా రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పేసి తాను చాలా మంచి వాడిననీ, జగనే తనను బెదరించి, ఒత్తిడి చేసి అటువంటి అసభ్య పోస్టులు పెట్టించారనీ, ఆయన ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేయించారనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 
దీంతో ఇక తాను చెప్పినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసే వారెవరూ పార్టీలో లేకుండా పోయారు. ఉన్న రోజా, కొడాలి నాని వంటి వారు మైకులను తప్పించుకుని తిరుగుతున్నారు.  దీంతో వేరే గత్యంతరం లేక జగనే స్వయంగా రంగంలోకి దిగిపోయారా?  బూతుల పంచాంగం తెరిచేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ క్రమంలో మేము ఎవ‌ర్ని ఏమ‌న్నా త‌ప్పులేదు.. మీరు అంటే మాత్రం త‌ప్పు..! క్ష‌మించ‌రాని నేరంకూడా అన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నిజానికి మొద‌టి నుంచి వైసీపీ నేత‌ల తీరు ఇదే.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు.   అధికారంలో ఉన్నంత కాలం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన జగన్, ఆయన పార్టీ నేతలూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా అధికార మదంతో తెలుగుదేశం కూటమి చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామనీ అప్పుడు ఇంతకింతా అనుభవించేలా చేస్తామనీ హెచ్చరికలు చేస్తున్నారు.  విజయవాడ జిల్లా జైలు బయట జగన్ మీడియాతో  మాట్లాడుతూ ఇలాంటి హెచ్చరికలే చేశారు.   తెలుగుదేశం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్.. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది వైసీపీయే అని జోస్యం చెప్పారు. అలా చెప్పి ఊరుకోకుండా.. పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు.

తెలుగుదేశం నేతలకు సెల్యూట్ చేస్తూ, వారి కోసం పని చేసే పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలనూ వదిలిపెట్టేది లేదన్నారు.  ఏడు సముద్రాల అవతలదాగినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. అటువంటి పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను బట్టలూడదీసి నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీసి నిలబెడతా అన్న వ్యాఖ్యలు జగన్ ను కచ్చితంగా ఇరుకున పెడతాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైనా ఆశ్చర్యం ఉండదు. 
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.