Publish Date:May 21, 2022
జగన్ పాలనలో కథలు అల్లడంలో పోలీసులు, మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇనుము దొంగలు కోర్టులో కీలక పత్రాలను చోరీ చేశారని పోలీసులు కథలల్లితే, హోంమంత్రి తానేటి వనిత రేపల్లె రైల్వే స్టేషన్లో సామూహిత అత్యాచారానికి పాల్పడిన వారికి అసలా ఉద్దేశమే లేదనీ, చోరీకి వచ్చిన వారు పొరపాటున అత్యాచారం చేశారనీ మరో కథ అల్లారు. తాజాగా ఇప్పుడు మంత్రి బుగ్గన జగన్ లండన్ ల్యాండింగ్ పై మరో స్టోరీ చేప్పారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ కు కారణం ఎయిర్ ట్రాఫిక్ అట. దావోస్ కు అని బయలు దేరి జగన్ లండన్ లో ప్రత్యక్షం అయినట్లు అంగీకరించిన ఏపీ సర్కార్.. ఆయన లండన్ లో ల్యాండ్ కావడానికి కారణం ఎయిర్ ట్రాఫిక్ అధికంగా ఉండటమే కారణమని వివరణ ఇచ్చింది.
ఈ వివరణ ఇచ్చింది మంత్రి, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన బృందంలో సభ్యుడు అయిన బుగ్గన రాజేంద్రనాథ్. ఎవరూ నమ్మడానికి వీల్లేని పకడ్బందీ కథ చెప్పారని సామాజిక మాధ్యమంలో బుగ్గన కథనంపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇంతకీ బుగ్గన చెప్పినదేమిటంటే.. గన్నవరం విమానాశ్రయంలో ప్రైవేటు విమానంలో బయలు దేరిన జగన్( దీనికి అద్దె గంటకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే) ఇంధనం నింపుకోవడానికి ఇస్తాంబుల్ లో ఆగింది.అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
దీంతో పాపం అనివార్యంగా ఇస్తాంబుల్ లో జాప్యం అయ్యింది. దాంతో లండన్ ఎయిర్ పోర్టుకు చేరడానికి మరింత ఆలస్యం అయ్యింది. లండన్ లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో జ్యూరిచ్ లో ల్యాండ్ అయ్యేందుకు ట్రావెల్ షెడ్యూల్ టైం దాటిపోయింది. దాంతో అధికారులు మళ్లీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారట. ఈ జాప్యం కారణంగానే జగన్ లండన్ లో బస చేయాల్సి వచ్చిందట. జ్యూరిచ్ లో ల్యాండింగ్ కు అనుమతి వచ్చినప్పటికీ పైలట్లు అలసిపోయి ఉండటంతో బయలు దేరలేదట. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్టు నిర్ణీత సమయం విశ్రాంతి తీసుకున్న తరువాతే జగన్ ప్రత్యేక ఫ్లైట్ (మరోసారి గుర్తు చేసుకోవాలి ఈ ఫ్లైట్ అద్దె గంటకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే.) బయలుదేరిందట. ఇక్కడ మంత్రివర్యులు బుగ్గన చెప్పని విషయం ఏమిటంటే.. జ్యూరిచ్ వెళ్లేందుకు లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇన్ని అవాస్తవాలు, అబద్ధాలతో జగన్ లండన్ బసను కవర్ చేయడానికి బుగ్గన ప్రయత్నిస్తున్నారంటేనే ఏదో మతలబు ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-london-tour-story-bu-buggana-25-136257.html
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.