జగన్ లండన్ టూర్ రద్దు?

Publish Date:Aug 30, 2024

Advertisement

ఎవరు ఎలాగైనా చావండి.. నేను మాత్రం లండన్ టూర్ వెళ్ళి తీరాల్సిందే అన్నట్టుగా వుంది వైసీపీ నాయకుడు జగన్ వ్యవహారం. ఒకవైపు వైసీపీ నాయకుల రాసలీలలు, మరోవైపు ఖాళీ అవుతున్న పార్టీ, ఇంకోవైపు ముంచుకొస్తున్న కేసులు.... ఇంకా బోలెడన్ని తలనొప్పులు.. అయినప్పటికీ జగన్ లండన్ టూర్ చేయాలనే ఫిక్స్ అయిపోయారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి సీబీఐ కోర్టు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, సీబీఐ కోర్టు చాలా పెద్ద మనసు చేసుకుని అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్‌లో ఎంజాయ్ చేయడానికి జగన్ సామాను సర్దుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆయన లండన్ టూర్ రద్దయ్యే అవకాశాలు వున్నాయన్న అనుమానాలు  ఏర్పడుతున్నాయి.

మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణ మొదలైంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిందితుడు. జగన్‌తోపాటు ఈ కేసులో మిగతా నిందితులు అయిన సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌కి కూడా గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. మరికొందరికి కూడా నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు నోటీసులు ఇచ్చినవారందరినీ పిలిపించి విచారణ జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా వున్న జగన్‌ని కూడా పోలీసులు పిలిచే అవకాశం వుంది. ఈ కేసులో విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సి వుంది. నా ఇష్టమొచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు. విదేశాలకు వెళ్ళడానికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి కూడా ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది కూడా సందేహమే. అందువల్ల జగన్ లండన్ టూరు మీద రఘురామ కేసు ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రఘురామ కేసు మాత్రమే కాదు.. ముంబై హీరోయిన్‌ కాదంబరి జెత్వానీని చిత్రహింసలకు గురిచేసిన కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం వుంది. హీరోయిన్‌ని హింసించడం వెనుక జగన్ హస్తం వుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఆదేశించడం వల్లనే పోలీసులు గానీ, వైసీపీ నాయకులుగానీ చాలా ‘అంకితభావం’తో హీరోయిన్‌ని వేధింపులకు గురిచేశారన్న అనుమానాలు వున్నాయి. ఈ కేసు విచారణను త్వరతగతిన పూర్తిచేసి, దోషులకు శిక్ష విధించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వుంది. కాదంబరి జెత్వానీ విజయవాడకు వచ్చి ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈ కేసుతో  సంబంధం వున్నవారందరినీ పోలీసులు ప్రశ్నిస్తారు. జగన్‌కి కూడా ఇందులో సంబంధం వుందని సెప్టెంబర్ 3వ తేదీ లోపు తేలిన పక్షంలో జగన్ ‌లండన్ టూర్‌కి వెళ్ళకుండా పోలీసులు ఆపే అవకాశం వుంది. ఇలా జగన్ లండన్ టూర్‌కి రెండు గండాలు పొంచి వున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.