జగన్ కు నో పాస్ పోర్టు.. లండన్ టూర్ క్యాన్సిల్?

Publish Date:Sep 13, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీతయ్యలాంటి వారు. ఎవరి మాటా వినరు. చివరికి ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా ఖాతరు చేయరు. ఎవరిమాటా వినని జగన్ కు సలహాదారులెందుకో మరి అని పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడెందుకీ ప్రస్తావన అనకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు. దాంతో ఆయనకు డిప్లమేటిక్ పాస్ పోర్టు రద్దైపోయింది.

అయితే పాస్ పోర్టు రెన్యువల్ కు హైకోర్టు అనుమతించింది.  జగన్ పాస్ పోర్టును ఆయన కోరిన విధంగా  ఐదేళ్ల రెన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో జగన్ లండన్ యానానికి అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు.  అయితే జగన్ కు ఐదేళ్ల పాస్ పోర్టు కు అనుమతించిన హైకోర్టు.. కింది కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అదీ నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా కోర్టుకు వెళ్లి మరీ పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది.  అయితే జగన్ ఎవరి మాటా వినే రకం కాదు కదా!  అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి వచ్చిన ఆయనకు ఇప్పుడు కోర్టుకు వెళ్లడం చిన్నతనంగా అనిపించింది. అయినా తనపై కేసుల విచారణకే కాదు.. కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు  హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతరామూ ఇష్టపడటం లేదు. అందుకే ఆయన పాస్ పోర్టు ఇప్పటికీ రెన్యువల్ కాలేదు. కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించలేదు. ఈ లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఆయన లండన్ పర్యటనకు కారణంగా చెప్పిన కుమార్తె పుట్టిన రోజు అయిపోయింది.  దీంతో ఆయన లండన్ యాత్ర రద్దైనట్లేనని భావించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఆయన లండన్ వెళ్లాలన్నా మరో కారణం చూపాలి.  మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాలి.  కచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ అఫడివిట్ దాఖలు చేస్తుంది. మళ్లీ వాదనలు తప్పవు. అప్పుడైనా ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందే. అందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో జగన్ ఇక విదేశీయానం అన్న మాటే ఎత్తకపోవచ్చు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.