Publish Date:Feb 18, 2025
గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజల చీత్కారాలతో 11 సీట్లకే పరిమితమయ్యారు. జనంలో రావడానికి భయపడుతున్నజగన్ జైలు యాత్రలకు మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా శ్రీకారం చుట్టారు. అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని జగన్ ఠంఛనుగా పరామర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది తాజాగా విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైకాపా అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. దళితుడైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన వల్లభనేని వంశీని హైద్రాబాద్ రాయదుర్గంలో ఆయన నివాసంలోనే ఎపి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే . గతంలో రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. తనను గెలిపించిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన అరాచకాలు ఆగలేదు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేసిన కేసులో వంశీ నిందితుడు. దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని మంగళవారం (ఫిబ్రవరి 18)ములాఖత్ లో పరామర్శించడానికి జగన్ విజయవాడ సబ్ జైలుకు మందీ మార్బలంతో వచ్చారు. జగన్ వెంట వైకాపా నేతలు కొడాలినాని, పేర్ని నాని కూడా ఉన్నారు. జైలులో వీరిరువురు రావడానికి అధికారులు నిరాకరించారు. భద్రతాకారణాల రీత్యా నిరాకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అనేక కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కూడా గతంలో జగన్ జైలులోనే పరామర్శించారు. జగన్ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జగన్ హాయంలో అరాచకాలు చేసిన నేతలను రెడ్ బుక్ లో పెట్టడంతో నందిగం సురేశ్ సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. అమరావతి రాజధాని చేయాలన్న మహిళలను దూషించిన కేసులో సురేశ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో జైలులో ఉన్నప్పుడు జగన్ పరామర్శించారు. జగన్ పాలనలో అక్రమాలు , అరాచకాలు జరిపిన నేతలు జైలు జీవితం గడుపుతుంటే జగన్ మాత్రం జైలు యాత్రలు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. తండ్రి వైఎస్ రాజశేశరరెడ్డి చనిపోగానే అధికారంకోసం జగన్ శవ యాత్రలు చేశారు.
వైకాపా పాలనలో అరాచకాలు పెట్రేగిపోవడంతో వరుసగా వైకాపా నేతలు అరెస్ట్ అవుతున్నారు. ప్రజా సమస్యల మీద పోరాడుతా అని మూడుసార్లు తేదీలతో సహా ప్రకటించిన జగన్ జనంలో వెళ్లడానికి మాత్రం జంకుతున్నారు. గత ఐదేళ్లలో అనేక నేరాల్లో నిందితులైన వైకాపా నేతలను జైలులో పరామర్శించడం విమర్శలకు దారి తీసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-jail-yatras-in-ap-39-193065.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.