మీడియా ముఖ విషకుంభం ‘సాక్షి’!

Publish Date:Aug 5, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను ఇటీవల బదిలీ చేసింది. బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది’’ ఇదీ భర్తకి తగ్గ భార్య వైయస్ భారతి సొంత పత్రిక  చిమ్మిన విషం. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన సమయంలో ఇదే భారతి  సాక్షి  పత్రిక, సాక్షి  టి.వి.లో  నాడు చంద్రబాబు  పాలనలో  36 మంది  డియస్పీలకు అక్రమంగా అన్యాయంగా  ప్రమోషన్ కల్పించారు అని  పెద్ద ఎత్తున  ప్రచార దాడి చేశారు.  చంద్రబాబుకు కులపిచ్చితో  తన సామాజిక వర్గం వారికి  మేలు చేయడానికి  నిబంధనలకు  విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారు అని  నానా యాగీ చేసారు.  అసలు  విషయం  ఏంటంటే,  కేవలం ముగ్గురు డియస్పీలకు 36 మంది అని  తప్పుడు ప్రచారం చేశారు.  ఈ ప్రచారాన్ని తెలుగుదేశం అధినేత  చంద్రబాబు, లోకేష్, ఇతర కమ్మ రాజకీయ నాయకులు ఎవరూ కూడా  ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు.  ఫలితంగా  నాడు  ప్రజలను నమ్మించగలిగారు.  అనేక  అబద్ధాల  పునాదులపై  ఒక్క చాన్స్ పేరుతో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది.  

ఈ ఐదేళ్ళ  జగన్ రెడ్డి  విధ్వంసకర  పాలనలో  అనేక  అమానవీయ  అకృత్యాలకు  స్వయంగా  జగన్ రెడ్డి  పాల్పడ్డారు.  చంద్రబాబు  సామాజిక వర్గం అంటే  దేశద్రోహులు అన్నట్టు  సాక్షాత్తూ  ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి  స్వయంగా  కులం పేరు పెట్టి నాటి  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుండి  డిజిపి హోదా కలిగిన ఎబి  వెంకటేశ్వరావు పదవీ విరమణ చేసే  చివరి రోజు  వరకు  ఎలా వేధించారో  అందరూ చూశారు. ఏపీఎస్ అధికారి గీతా దేవి దగ్గర నుండి  సిఐ, యస్ఐ  స్థాయి అధికారుల వరకు  వేధింపులకు  గురిఅయ్యారు. చివరకు  కమ్మ కుల వ్యాపారస్తులకు  వేధింపులు తప్పలేదు.  ఇక్కడ మీకు  ఒక  ఆస్తక్తికరమైన  కొన్ని  సంఘటనలు  మీకు చెబుతాను.  చార్టెడ్ అకౌంటింగ్‌లో  దేశంలోనే  అగ్రస్థానం సాధించిన ఒక  సిఎ  ఒక శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీని  కలుసుకుని ప్రభుత్వ శాఖల  ఆడిట్ చేస్తాను  అవకాశం కల్పించండి అంటే,  ఆ అధికారి  ఆడిట్ చేయటానికి  మీకు అన్ని అర్హతలు వున్నాయి. కానీ  మీ ఇంటి పేరు  ముఖ్యమంత్రి జగన్ గారికి  ఇష్టం వుండదు అని బదులు ఇచ్చారంట!  గత టిడిపి ప్రభుత్వంలో  చెల్లించాల్సిన  బిల్లులు సైతం  కులం చూసి చెల్లించిన  ప్రభుత్వం  నాటి  జగన్  ప్రభుత్వం.  వికృత  కాలకూట  కుల  ద్వేషం, వ్యక్తిత్వ హననానికి అంతే లేకుండా పోయింది. దమన నీతి పాలన సాగింది.  నిలువెల్లా విషం నింపుకుని  రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.  నిజం కాదా?   వేల మందికి  ఉపాధి కల్పించే  అమర్ రాజా కంపెనీని మేమే పొమ్మని  పంపించేశాం అని  ముఖ్యమంత్రి  సలహాదారు సజ్జల  నిర్లజ్జగా  బరితెగించి  ప్రకటన  చేయటాన్ని  ఎలా  చూడాలి? దాన్ని ప్రజా పాలన  అందామా?   

యాబై ఏళ్ళ పాటు   రాజకీయ  రెడ్ల చేతుల్లో  అధికారం  వుంది  రాయలసీమకు  వీళ్ళు  వరగబెట్టింది ఏంటి? కోస్తా  ఆంధ్ర  ఉత్తరాంద్ర  ప్రజలకు  తవ్వి తలకెత్తింది  ఏమైనా ఉందా? కులాన్ని  అడ్డం పెట్టుకుని  రెడ్డి  కులానికి  వీళ్ళు  చేసిన  మేలు ఏంటి!   జగన్  ఏలుబడిలో  జగన్  చుట్టూ  వున్న   ఆ వెయ్యి మంది  రెడ్లకు  తప్ప   రెడ్డి కులానికి  ఈయన గారు  చేసిన  మేలు  చెప్పగలరా?   రెడ్డి  కులానికి మేలు  చేయకపోగా  అంతులేని  కీడు  జగన్ ప్రభుత్వం చేసింది. కమ్మ కులాన్ని ద్వేషించటం వేధించడం రెడ్లను  సంతృప్తిపరచడం కోసమే  అనే  వికృత  మనస్థత్వంతో   పాలన  సాగింది.  ఈ మోడల్‌లో ఒక్క రెడ్డి కుటుంబం  బాగుపడిన  పరిస్థితి వుందా?  ఈయనగారి  ప్రభుత్వంలో   పనులు చేసిన  రెడ్లకు  బిల్లులు  చెల్లించకపోతే  ఆ  కుటుంబాలు  రోడ్డున పడ్డాయి. రెడ్లు  ఆస్తులు   అమ్ముకున్నారు. 

మాచర్ల పిన్నెల్లి  రామకృష్ణా రెడ్డిని   ఉత్తముడు అని నిసిగ్గుగా, వెరపు లేకుండా అలవోకగా ఆశుద్దం మాట్లాడటం  జగన్  నైజం. మాచర్ల   ఒక చంబల్ లోయ. పిన్నెల్లి  అరాచకాలకు  భయపడి  ఊళ్ళకు ఊళ్ళు జనం ఇళ్ళకు  తాళాలు వేసుకుని   పరాయి పంచన  బిక్కుబిక్కుమంటూ  ప్రాణాలు  అరచేతిలో పెట్టుకుని  ఐదేళ్ళపాటు  భయం  నీడలో  గడిపారు. ఆఖరికి మొన్న  ఎన్నికల్లో  ఎన్నికల కమీషన్ బిందుమాధవ్ అనే   ఒక  నిప్పుకణికను  పల్నాడు యస్‌పిగా  నియమించింది.   ఎన్నికల్లో  పిన్నెల్లి హింస ఏస్థాయిలో  జరిగిందో  చూశాం. బిందుమాధవ్‌కు  క్రింది స్థాయి  సిబ్బంది  సహాయ నిరాకరణ చేశారు.  కారణం  వారంతా  పిన్నెల్లి నియమించుకున్న దళం. నాటి  డీజీపీ కసిరెడ్డి  రాజేంద్రనాథ్‌కి ఎస్పీ బిందుమాధవ్  ఎంత చెప్పినా  పట్టించుకోలేదు.  పైపెచ్చు  అల్లర్లు  జరిగే గ్రామాల్లో  మాధవ్ బైండోవర్  చేస్తుంటే వారిని  వదిలిపెట్టు అని  పోలీస్  సెట్లో చెప్పారంటే  ఎంత బరితెగింపు. బిందుమాధవ్  చురుకైన  అధికారి  అతని  ట్రాక్ రికార్డు  మచ్చలేనిది.  అనేక  రివార్డులు  ఆయన సొంతం. కానీ నాటి చీఫ్ సెక్రటరీ  జవహర్ రెడ్డి  మాధవ్‌ను  సస్పెండ్ చేయించారు.  జగన్  ఏలుబడిలో మాధవ్ కంటే  జూనియర్స్‌కు  లా అండ్  ఆర్డర్  పోస్టింగ్‌లు  ఇచ్చి  మాధవ్‌ని అప్రధాన్య పోస్టులకే పరిమితం చేసారు.  కారణం  ఏంటి అనుకుంటున్నారు?  మీరు  అనుకునేది  మాత్రం కాదు!  బిందు మాధవ్ కమ్మ కులం కాదు  బ్రాహ్మణ సామాజికవర్గం  మరి అయితే  వేధింపులకు  కారణం  ఏంటి? బిందు మాధవ్ ప్రేమ వివాహం  చేసుకున్నారు.  మాధవ్  శ్రీమతి  కమ్మ సామాజిక వర్గం.  ఆమె  ఒక ప్రముఖ  సైంటిస్ట్. మన రాష్ట్రంలో కూడా  వుండరు  కేంద్ర ప్రభుత్వ శాఖలో  పని చేస్తారు.  ఇప్పుడు చెప్పండి  ఈ వికృత  ఆటవిక పాలనకు  ఏ పేరు  పెడదాం?  

పవన్ కళ్యాణ్‌ను ఆయన  సామాజిక వర్గం  వారితో  బండ బూతులు  తిట్టించడం, వ్యక్తిగత  దాడి చేయటం  మనం  చూశాం. మాజీ  మంత్రి పేర్ని  నాని  నాలుగు  అడుగులు  ముందుకేసి,  మా  కాపు నాకొడుకులు అనడం! అవును  నేను  జగన్  గారికి  పాలేరునే  అనడం మనం  చూశాం. మొత్తానికి ఐదేళ్ళ  జగన్ పాలనలో  వ్యవస్థల విధ్వంసం కళ్ళారా చూశాం!  ఆ పైన  ఘనమైన ప్రజా తీర్పు చూశాం. మళ్లీ  మళ్లీ  జగన్ రాకాసి మూక  వారి కరపత్రం  జగన్  శ్రీమతి  భారతి  నడిపే  పత్రికలో  అవే రోతరాతలు  అవే  కుల వైషమ్యాలు.  ఇటీవల మొత్తం  96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.  అందులో  54 మందికి  పోస్టింగ్ ఇవ్వలేదు.  ఎందుకు ఇవ్వలేదు  అంటే,  ఈ  ఐదేళ్ళ సీమ పాలెగాడి  వికృత పాలనలో  వీళ్ళు అనేక  అకృత్యాలకు  పాల్పడ్డారు.  54 మందిలో  15 మంది  రెడ్డి కులస్తులు వున్నారంట!  వారిని  చంద్రబాబు  పక్కన పెట్టారంట!  రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు వేధించడానికి  సిద్దమయ్యారంట... ఇది  సాక్షి కథనం.  

దీంట్లో  మొదటి  విషయం...  అధికారుల్లో  కూలాలను  చూడటం ఏంటి?  54 మందికి  పోస్టింగ్ ఇవ్వకపోతే  ఆ 15 మంది  ప్రస్థావన ఎందుకు?  ఆ 54లో  15 మంది  కాకుండా  మిగతా 39 మంది ఎవరు?  ఆలస్యం ఎందుకు  మరి  వాళ్ళ కులపోళ్లను  కూడా రెచ్చగొట్టండి!  మీరు పాలించేటప్పుడు మీకు  పాలేర్లు కావాలి!  అధికారం పోగొట్టుకున్నా కూడా  ఆ పాలేర్లే  అధికారులుగా  కొనసాగాలని  జగన్ పత్రిక  కోరుకుంటుంది. నేటికి  అనేక మంది  నిజాయితీ పరులైన  రెడ్డి  సామాజిక వర్గం  అధికారులు అనేక మంది  కూటమి  ప్రభుత్వంలో  కీలక పదవులు నిర్వరిస్తున్నారు. గతంలో  కులాన్ని ‘చూషి’, ‘షేషిన’ పాలన చూశాం.  నేడు  అదే కులం  ముసుగులో  రెడ్లకు  న్యాయం చేయడానికి బయలుదేరారు. నమ్మండి ప్లీజ్  చివరగా  ఒక్క  విషయం గుర్తుంచుకోండి  రాజకీయ  రెడ్లు వేరు!  రెడ్డి కులం వేరు! రాజకీయ  కమ్మలు వేరు  కమ్మ కులం వేరు.  రాజకీయ నాయకులను మా కులం అని  చంకలు గుద్దుకోకండి.  వారందరిది  రాజకీయకులం.  యాబై ఏళ్ళ రెడ్ల  పాలనలో  రెడ్డి కులం  ఏం బాగు పడింది? టీడీపీ పాలనలో  నాశనమైన  కమ్మవాళ్ళతో  పోలిస్తే  బాగుపడిన వారు  అరడజను  మించి వుండక పోవచ్చు.  ప్రజలు  ఆలోచించాల్సింది  కులాలు కాదు  వారి  పిల్లల  బంగారు  భవిష్యత్తుకు  బాటలు  వేసే పాలకుల కోసం ఆలోచన చేయాలి.

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.