జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!

Publish Date:Dec 5, 2025

Advertisement

అమరావతి నెత్తిన జగన్ పాలు పోశారంటున్నారు పరిశీలకులు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. సరే రాష్ట్ర ప్రజలంతా అమరావతి వెంనే ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితం తేల్చేసింది. అధికార పగ్గాలు చేపట్టినత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమరావతి పురోగతి పనులను వాయువేగంతో చేపట్టింది. జగన్ కాలంలో జంగిల్ గా కనిపించిన అమరావతి ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో, నిరాటంకంగా సాగుతున్న నిర్మాణ పనులతో కలకలలాడు తోంది. అయినా అందరిలో ఓ చిన్న అనుమానం. ఐదేళ్ల తరువాత అంటే 2029 ఎన్నికలలో ఏదైనా అనూహ్యం సంభవించి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇదే సంశయం అమరావతి రాజధాని రైతులనూ తొలిచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా  అందుకు సై అంది.  అమరావతికి రక్షణగా నిలవడానికి ముందుకు వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత, ఏకైక  రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించడానికి సై అంది. 

ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లాంఛనమే అన్నది రూఢీ అయిపోయింది. దేశం మొత్తంలోనే ఏ రాష్ట్ర రాజధానికీ ఇలా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలేదు. చటబద్ధత కల్పించిన పరిస్థితీ లేదు. ఒక్క అమరావతికి మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఇందుకు ఎవరు ఔనన్నా కాదన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ఇసుమంతైనా దాచని అమరావతి ద్వేషం కారణంగానే సపోజ్ ఫర్ సపోజ్ ఆయన భవిష్యత్ లో పొరపాటున అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఒక్క ఇటుక ముక్క కూడా కదిలించే అవకాశం లేకుండా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రాబోతోంది.  దేశంలో ఏ రాజధానికీ దక్కని ఈ భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దక్కడానికి జగన్ ద్వేష పూరిత, కక్ష సాధింపు రాజకీయ వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.