సిట్టింగుల మార్పుతో తెలుగుదేశం విజయానికి జగన్ రాచబాట?!

Publish Date:Dec 31, 2023

Advertisement

సహజంగా ఎన్నికలనగానే ముందుగా గుర్తొచ్చేది సీట్లు.. టికెట్లు. టికెట్ ఎవరికి ఇస్తారు? ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీలో ఉన్నారు? ఏయే నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులు అనేది కీలకం. అయితే  ఇందులో దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీకే అభ్యర్థుల ఎంపిక నుంచీ.. గెలుపు గుర్రాలను ఎంచుకునే విషయంలో  మంచి అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో ఉంటుంది కనుక.. పరిస్థితులను   అనుకూలంగా మలచుకొనే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షాలు ప్ర  అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకుని   ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతారు. కానీ అధికార పార్టీ మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ముందుగా ప్రయత్నిస్తుంది.  చివరిలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దిగుతుంది. కానీ, ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వ విధానంలాగే.. ఎన్నికలకు సమాయత్తమౌతున్న విధానం కూడా రివర్స్ లోనే ఉంది.  తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా  ఇక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటి విషయంలో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో.. ముందుగా అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు.  భారీ స్థాయిలో సిట్టింగుల మార్పునకు శ్రీకారం చుట్టారు. అధికారికంగా ఓ 11 మంది సిట్టింగులను మార్చేశారు. ఇంకా చాలా చాలా మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ మార్పులను ప్రకటించే ధైర్యం చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఉప్పెనలా లేచిన అసంతృప్తితో.. అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించేసి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైపోయారు. అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారిని కనీసం కలవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు డొక్క వరప్రసాద్ వంటి వారే   బహిరంగంగా జగన్ ను ఓ సారి కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నారంటే వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుంది. ఒక వేళ జగన్ మొండిగా సిట్టింగుల మార్పుతో ముందుకు వెళ్లినా     కొత్త అభ్యర్థులను కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి పార్టీలో లేదు. అందుకే ముందుగా  ఇన్ చార్జీల మార్పు పేరిట వారిని నియోజకవర్గాలకు పంపి,  రేపు వారినే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించేందుకు ప్లాన్ వేశారు.

ఇలా చేయడం ద్వారా తన లోని ఓటమి భయాన్ని బయటపడకుండా, గెలుపు ధీమా  సంకేతాలు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.  కానీ సిట్టింగుల మార్పు వ్యూహంతో వైసీపీలో గెలుపు ధీమా  సంగతేమో కానీ.. తెలుగుదేశంకు  ఇది మేలు చేసేలా ఉంది. జగన్ ఇలా ముందే అభ్యర్థులను ప్రకటించడం తెలుగుదేశం, జనసేన కూటమికి కలిసి వచ్చిన అవకాశంగా మారుతోంది.   చంద్రబాబు లాంటి రాజకీయ మేధావికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తమ అభ్యర్థుల ఎంపికకు సమయం ఇవ్వడమే కాకుండా పర్ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకొనేందుకు మంచి అవకాశంగా కూడా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరో ముందుగానే తెలియడం వల్ల   ఆ నియోజకవర్గంలో సమస్యలు, రాజకీయ-సామాజిక పరిస్థితులు వంటివి అంచనా వేసుకొని తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే సావకాశం కలుగుతుందంటున్నారు.  వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో టీడీపీ-జనసేన కూటమికి   అభ్యర్థుల ఎంపిక మరింత సౌలభ్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే శత్రువును ఎలా దెబ్బకొట్టాలో కావాల్సినంత సమయం తీసుకొని పక్కా స్కెచ్ వేసి బరిలోకి దిగే వీలు కలుగుతుంది. ప్రత్యర్థి బలం బలహీనత ముందే తెలియడంతో టీడీపీ, జనసేనకు ఎదుర్కోవడం మరింత సునాయాసమైపోతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇప్పటికే గెలుపు ఆశలు అడుగంటిపోయిన వైసీపీకి జగన్ నిర్ణయం మరింత నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.  

మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జగన్ మార్పులు, చేర్పుల దిశ‌గా దూకుడుగా అంతకు మించి మొండిగా కూడా ఉన్నారు. ఐ ప్యాక్ టీం చెప్పిందో.. లేక సొంత సర్వే సంస్థలు చెప్పాయో.. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చేస్తున్నారో కానీ దాదాపు  90 మంది సిట్టింగులను మార్చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచేవారి స‌త్తా ఎంత? వారి ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? కుల‌, మ‌త, సామాజిక పరిస్థితులు వంటి కీల‌క విష‌యాల‌ ఆధారంగా, కాస్త ఆలస్యమైనా టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు.  అందుకే టీడీపీ, జనసేనలో అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు కోసం ఎలాంటి తొందరా కనిపించడం లేదు. ఎలాగూ వైసీపీ అభ్యర్థులు ఎవరో రానున్న రోజులలో తేలిపోతుంది కనుక అప్పుడు అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు టీడీపీ, జనసేన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి.  మొత్తం మీద జగన్ తొందరపాటు, ఓటమి భయంతో పడుతున్న తడబాటు ఏపీలో ఆ పార్టీ పుట్టి ముంచి, తెలుగుదేశం విజయానికి రాచబాట వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.