మర్రిని నిందించే నైతిక హక్కు జగన్‌కు లేదు!

Publish Date:Mar 19, 2025

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి.  వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసిన నేపథ్యంలో, ఆయనను నిందించడానికి గానీ, పార్టీకి ద్రోహం చేశాడని అనడానికి గానీ జగన్ కి  నైతిక హక్కు లేదని.. పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉంటూ.. ఆయన వెంట నడిచినందుకు.. ఆయన వంచనకు గురైన వారిలో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు జగన్ చేసిన అన్యాయానికి ఆయన ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే చాలా పెద్ద విషయం అని ఆ పార్టీలో ఉన్న వారే వ్యాఖ్యానిస్తున్నారు.  
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ ను అంటిపెట్టుకుని ఉన్న మర్రి రాజశేఖర్ కు.. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ..  2019 ఎన్నికల్లో మర్రికి టికెట్ నిరాకరించారు జగన్!  అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనికి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం.. మర్రి అభిమానులను ప్రలోభ పెట్టే మాటలు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా చేస్తానని బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ఆయనకూడా విడదల రజని విజయం కోసం కష్టపడి పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదవి రజనికి దక్కింది తప్ప మర్రి రాజశేఖర్ ఊసు వినపడలేదు. ఎమ్మెల్సీగా మాత్రం చేశారు.
మధ్యలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినప్పుడు.. మర్రికి పదవి గ్యారంటీ అని పార్టీలో అంతా అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా జగన్ మాట నిలబెట్టుకోలేదు. రాజశేఖర్ ఎంత సహనంతో ఉన్నప్పటికీ.. 2024 ఎన్నికల సమయానికి సర్వేల్లో విడదల రజనికి ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తేలడంతో ఆమెను నియోజకవర్గం మార్చి గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయించారు. అప్పుడు మర్రి రాజశేఖర్ టికెట్ ఆశించినా ఇవ్వలేదు. చివరికి ఆ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. మళ్లీ విడదల రజినిని వెనక్కు తీసుకువచ్చి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ఆయనకు మనస్తాపం కలిగించాయి. చాలా కాలంగా ఆయన పార్టీని వీడదలచుకున్నట్టుగా ప్రచారం జరిగింది.  వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్లు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించారు. బుధవారం మండలి ఛైర్మన్ కు రాజీనామా సమర్పించే ముందు బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్సీలు కొందరు కూడా రాజీనామా ఆలోచన మానుకోవాలని సూచించారు. అయితే మర్రి వారి మాటలను ఖాతరు చేయలేదు.  ఏ రకంగా చూసినా సరే.. మర్రికి జగన్ చేసిన అన్యాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక.. ఆయన నిష్క్రమణ.. రాజీనామా గురించి నింద వేయగల నైతిక హక్కు జగన్ కు లేదని.. పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
భారత క్రికెట్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు.
విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో పాల్గొన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు విచారణలో భాగంగా ప్రశ్నించిన అధికారులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు.
విశాఖలో జూన్ 21న యోగా డే రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో ప్రచారం చేపట్టలని దీనిపై ప్రజలకు సన్నద్దం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది
బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది.
తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.