అమ్మఒడి బాటలోనే ఈబీసీ నేస్తంకు ఎగనామం! మడమ తిప్పేస్తున్న జగన్ రెడ్డి... 

Publish Date:Jan 8, 2022

Advertisement

మాట తప్పను.. మడమ తిప్పను... ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదం. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చితీరుతానని చెప్పారు. కాని ఇప్పుడు సీఎంగా మడమ తిప్పడమే ఆయన ముఖ్య నినాదంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా హామీలకు ఆయన మంగళం పాడేశారు. మద్యపాన నిషేదం హామీని గంగలో కలిపి... జనాలను మద్యం తాగించడమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అమ్మఒడికి 2021-21 సంవత్సరానికి గాని ఎగనామం పెట్టేశారు. తాజాగా ఈబీసీ నేస్తం పథకానికి హ్యాండిచ్చేశారు జగన్ రెడ్డి. ఈబీసీ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో జనవరి 10న నిధులు జమ చేయాల్సి ఉంది. ఇందుకోసం నంద్యాలలో భారీ సభకూ ఏర్పాట్లు చేశారు. కాని చేతిలో కాసులు లేకపోవడంతో ఆపేశారు. నిధుల కోసం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. అప్పుకోసం కేంద్రాన్ని విన్నవించుకుంటున్నారు. కేంద్రం కరుణిస్తే మంగళవారం నిధులు లేదంటే ఈబీసీ నేస్తం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు.

‘ఈబీసీ నేస్తం’ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన 45 సంవత్సరాలు దాటిన ఓసీ మహిళలకు ఏటా రూ.15వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత సోమవారం సీఎం జగన్‌ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసి అప్పుల అనుమతి కోసం విజ్ఞప్తి చేసుకోగా  రాత్రికి రాత్రే రూ.2500 కోట్ల అప్పు పుట్టింది. వచ్చింది వచ్చినట్లుగా ఆ మొత్తాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశారు. అయినా అప్పులు ఈజీగా పుడతాయని, ‘ఈబీసీ నేస్తం’ అమలు చేయవచ్చునని భావించారు. ఆర్థిక మంత్రి, సెక్రటరీలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ నెల 10న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో భారీ సభను ఏర్పాటు చేశారు. కానీ  ప్రభుత్వం అనుకున్నట్లుగా కొత్త అప్పు పుట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో, అనుకున్న సమయానికి అప్పు కూడా అందకపోవడంతో ఈబీసీ నేస్తం పథకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.

కొత్త అప్పులకు అనుమతిచ్చిన వారానికే మళ్లీ మరింత అప్పు కోసం ఢిల్లీ యాత్రలు మొదలుపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కలిసి అప్పుల కోసం విన్నపాలు చేసుకోనున్నారు. కేంద్రం కరుణించి అనుమతిస్తే మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తెచ్చుకుంటారు. ఆ మొత్తంతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే గురువారం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ.1430 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తారని అంతా భావించారు. కానీ వాటిని ప్రభుత్వం వేరే అవసరాలకు వాడడంతో ఈబీసీ నేస్తం పథకానికి డబ్బుల్లేకుండా పోయాయి. ఇప్పుడు మంత్రి, సెక్రటరీల ఢిల్లీ యాత్ర ఫలించి అప్పులకు అనుమతి వస్తేనే ఈబీసీ పథకం ఉంటుందని లేదంటే వాయిదా కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.