రెండేళ్లుగా చివాట్లే చివాట్లు.. అహంకారమే అసలు సమస్యా?  

Publish Date:Jun 25, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ కాదు. చివరిది కూడా కాకపోవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం ఆలవాటుగా మారి పోయింది. అదే క్రమంలో ఇప్పుడ మరో మొట్టికాయ గట్టిగా పడింది. ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు,ఇది సమయం కాదు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం అంటే, పిల్లల ప్రాణాలతో చేలగాడం ఆడడమే అవుతుంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇది తెలుసుకునేందుకు అంత, ‘అజ్ఞానం’ కూడా అవసరం లేదు. అయినా, అపోజిషన్ పరీక్షలు రద్దు చేయమని కోరింది కాబట్టి, అపోజిషన్ను అపోజ్  చేయడమే సర్కార్ విధానంగా పెట్టుకున్న జగన్ రెడ్డి ఆరు నూరైనపరీక్షలు నిర్వహింఛి తీరాలని నిర్ణయించారు. అందుకోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. బొక్కబోర్లా పడ్డారు. కోర్టు పెట్టవలసిన నాలుగు పెట్టిన తర్వాత, అమాత్యవర్యులు, ముఖం చిన్నబుచ్చుకుని, మంత్రసాని తనం ఒప్పుకున్నడకు తప్పదన్నట్లుగా పరీక్షలను రద్దు ప్రకటించారు. 

ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రతి విషయంలో కోర్టుల జోక్యం ఎందుకు అవసరం అవుతుంది? ఇందుకు ఇంకా చాలా కారణాలు ఉంటే  ఉండవచ్చును కానీ, ప్రధాన కారణం మాత్రం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అహంకార ధోరణే ప్రధాన కారణమనేది అందరి మాట. నిజానికి, ఈ నిజం, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు, అధికారులకు, సలహాదారులకు అందరికీ తెలుసు. అయినా, మొండివాడు రాజుకంటే బలవంతుడు, రాజే మోడీ వాడైతే ... అనుకుంటారో ఏమో కానీ, ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం చేయరు. అయితే, ప్రైవేటుగా ఎవరిని పలకరించినా, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వలన ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అధికారులు అవమానాల గురవుతున్నారని, కోర్టుల ముందు తలవంచుకోక తప్పడం లేదని, అన్నిటినీ మించి ప్రజలు ఇప్పందులు పడుతున్నారని అంటారు.  

సహజంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు, అనేక కోణాల్లో మంచి చెడులను అలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ, ఏపీలో అందుకు పూర్తి విరుద్ధంగా, ముందు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత మంత్రులు అధికారులు, సలహాదారులు, రాజ్యాంగం ఒకటుందనే విషయాన్ని మరిచి పోయి, అడ్డదారులలో,ఆ నిర్ణయం అమలకు ప్రయత్నిస్తారు. చివరకు  కోర్టుల చీవాట్లతో, కథ ముగుస్తుంది. అందుకే  ప్రారంభంలోనే అనుకున్నట్లుగా, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు కేసు మొదలు ప్రస్తుత పరీక్షల కేసు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుల్లో ఓడిపోయిన కేసుల సంఖ్య, ఖచ్చితంగా ఎంతుంటుందో కానే, ఖాయంగా సెంచరీ దాటేసిందని మాత్రం చెప్పవచ్చును అంటున్నారు.   

అయినా ముఖ్యమంత్రి మాత్రం అదే ధోరణిలో పోతున్నారు.  నిప్పుతో చెలగాటం ఆడితే  చెయ్యి కాలుతుంది, ఇది అందరికీ తెలుసు అయినా, నేనింతే ... అంటే ... వాతలు తప్పవు. ఏపీలో అదే జరుగుతోంది. ప్రస్తుత పరీక్షల విషయాన్నే తీసుకుంటే, సుమారు రెండు నెలలకు పైగా, ప్రతిపక్షాలే కాదు పిల్లల తల్లి తండ్రులు, విద్యావేత్తలు,మేధావులు పరీక్షలు రద్దు చేయమని కోరుతున్నారు. మరో వంక ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటుగా, 21 రాష్ట్రాలు 10+2 పరీక్షలను రద్దు చేశాయి. చివరకు సీబీఎస్సీ, ఐసీఎస్ఈ’లు కూడా అదే బాటలో నడిచాయి. అయినా, ఊరందరి దారిలో కాకుండా ఏపీ ప్రభుత్వం మరోదారిన పోయింది. దేశంలో మరే రాష్ట్రంలోని విద్యార్ధులకు జరగని తీరని నష్టం, ఒక్క ఏపీ  విద్యార్దులకే జరుగుతుందన్న వితండవాదంతో విధ్యార్ధులను, విద్యార్ధుల తల్లి తండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.  ఎంసెట్‌ ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉందని చెబుతూ వచ్చారు. అది నిజం. అయితే, ఇంటర్ మార్కులకు వెయిటేజీ ముందు నుంచి లేదు, ఈ మధ్య కాలంలో వచ్చింది. ప్రభుత్వం తలచుకుంటే, వెయిటేజీ వచ్చిన దారిలోనే వెనక్కి పోతుంది. అదేమంత  పెద్ద పనికాదు. అయినా, మంత్రిగారు”‘పరీక్షలు రద్దు చేయడం నిమిషం పట్టదు. కానీ, ఇంటర్‌ పరీక్షలకు ఎంసెట్‌ పరీక్షలకు లింకు ఉంది’’ అని చెపుతూ వచ్చారు, చివరకు తప్పని సరి పరిస్థితిలో తూచ్’ అని తప్పుకున్నారు. 

సాధారణ సాధారణ పరిస్థితులకు, అసాధారణ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది .. అందుకే ప్రభుత్వం సాధారణ పరిస్థితులలో అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు ... 360 డిగ్రీలలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పరిస్తితులు అనుకూలించక పోతే, ఏమి చేయాలి అనేది కూడా ముందే అలోచించి కంటిన్జెన్సీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది . అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి  అన్నిటికీ అతీతం, కుందేటికి మూడే కాళ్ళని నమ్మే ప్రభుత్వం. అందుకే ఇన్ని ఎదురుదెబ్బలు...ఇన్ని చీవాట్లు .. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ... God resists the proud, but gives grace to the humble: అనే   బైబిల్ సూక్తిని గుర్తు చేసుకుని అయినా అహం కొంచెం తగ్గిచుకుంటే.. మంచిది, అంటున్నారు...సామాన్య జనం.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.