ఏపీ అప్పుల రాష్ట్రం. దివాళ అంచున చేరిన రాష్ట్రం. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలివ్వడమే కష్టం. నవరత్నాలకు నిధులు లేక.. అమ్మ ఒడిని అటకెక్కించే ప్రయత్నం. కార్పొరేషన్ల పేరున రుణాలు తీసుకొని.. పక్కదారి పట్టించే స్కీం. ఏపీ అప్పులు చూసి.. కొత్తగా అప్పులిచ్చేందుకు జంకుతున్నాయి పలు ఆర్థిక సంస్థలు. దీంతో.. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తూ నెట్టుకొస్తోంది జగన్ సర్కారు. ఆ బాండ్లు కూడా కొనేవారు కరువవడంతో.. భారీ వడ్డీ ఆశగా చూపించి.. తాజాగా మరో వెయ్యి కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ ఈ రుణాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్లకు 500 కోట్లు, 18 ఏళ్లకు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం కేంద్రం వద్ద ఆర్ధిక శాఖ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెడపై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఫాల్టర్ కత్తి వేలాడుతోంది.
అప్పు అయితే చేస్తోంది కానీ.. వాటిని తిరిగి తీర్చే మార్గమే కనిపించడం లేదు. 17 ఏళ్ల కాలపరిమితి కావడంతో.. ఇప్పుడు వడ్డీ కడితే సరిపోతుంది. అసలు ఇప్పటికిప్పుడు తీర్చాల్సిన పనిలేదు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తాను గెలిచేది లేదు.. మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదూ.. 17 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారో ఏమో అనుకుంటూ.. ఏపీ ప్రజల నెత్తిన వేల కోట్ల అప్పు రుద్దేస్తున్నారు. తెచ్చిన డబ్బులన్నీ రాష్ట్ర అభివృద్ధికి కాకుండా సంక్షేమ పథకాల రూపంలో పప్పు-బెల్లంలా పంచేస్తుండటంతో రుణాలన్నీ నిష్పయోజనంగా మారుతున్నాయి. ఏపీ మరింత దివాళ తీస్తోంది..అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-govt-1000-crore-loan-from-rbi-25-126076.html
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.