చేపా చేపా.. రాజుగారి దుకాణంలో ఎందుకు అమ్ముడవ్వడం లేదు!

Publish Date:Jun 20, 2022

Advertisement

అనగనగా ఓ రాజు.. ఆ రాజుగారికి ఓ రోజు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే తన రాజ్యంలో ప్రజలందరికీ నాణ్యమైన చేపలను అందించాలనీ, తద్వారా నిండుకున్న ఖజానాకు కుప్పతెప్పలుగా ఆదాయం వచ్చి పడుతుందని ఆయన అనుకున్నారు. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది? వెంటనే తన మహామంత్రిని పిలిచి తన ఆలోచన చెప్పేరు. బ్రహ్మాండం మహారాజా అంటూ ఆయన మెచ్చేసుకున్నారు. అంతే వెంటనే రాజ్యంలో చాటింపు వేయించేశారు. ఇక జనం అంతా రాజుగారు దయతో ప్రారంభించిన చేపల దుకాణాలలోనే చేపలు కొనుక్కోవాలనీ, వాటిని వండుకు తింటే మాంఛి రుచిగా ఉంటుందనీ. అయితే రాజుగారి ఆలోచన, ఆయన అమ్మే చేపలూ ప్రజలకు నచ్చలేదు. దీంతో రాజుగారి చేపల దుకాణాలు వెలవెల బోతుంటే.. మత్స్యాకారుల దుకాణాలు కిటకిట లాడుతున్నాయి.

దీంతో ఆగ్రహించిన రాజుగారు.. రాజ్యంలో తన చేపల దుకాణాలు తప్ప.. ఇంకే చేపల దుకాణాలూ ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ పాలన తప్ప మిగతావన్నీ చేస్తోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే విపక్ష నేతలపై కేసులు పెడుతోంది, వారిని అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా అరెస్టులు చేస్తోంది. విచారణలంటూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. నివాసాలపైకి బుల్ డోజర్లతో దాడులకు దిగి కూల్చివేతలకు సైతం తెగబడుతోంది.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలవారికీ ప్రభుత్వ చేపల రుచి చూపించాలనుకున్నారు జగన్. వెంటనే ఫిష్ ఆంధ్రా అంటూ మార్టులు ప్రారంభించేశారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచీ జగన్ ఈ ప్రభుత్వ చేపల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే.. పాపం జగన్ ప్రభుత్వ చేపల వ్యాపారం తుస్సు మంది. కొనేవాళ్లు లేక అనతి కాలంలోనే మూత పడ్డాయి. ఫిష్ ఆంధ్రా మార్ట్ కోసం విదేశాల నుంచి తెప్పించిన ఆధునిక శీతలీకరణ యంత్రాలు, మార్టుల కోసం చేసిన ఖర్చూ కూడా వృధా అయ్యింది. దీంతో ప్రభుత్వం చేస్తే నష్టం వస్తున్న చేపల వ్యాపారాన్ని చిన్నా చితకా మత్స్యకారులు ఎలా చేసుకుంటారు అంటూ ఆగ్రహించినట్లుంది. అంతే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో చేపలమ్మే వారిపై విజిలెన్స్ దాడులకు ఉపక్రమించింది.  కేసులు పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే వారు చేపలు అమ్మేటప్పుడు తూకం సరిగా వేయడం లేదట. దీని వల్ల పాపం వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారట.

చేపల విక్రయదారులపై విజిలెన్స్ దాడులకు ప్రభుత్వం చెబుతున్న కారణమిది. అయితే వినియోగదారులు కూడా చేపల తూకం సరిగా లేకపోవడమేమిటి? మేమేమైనా ఫిర్యాదు చేశామా అంటూ విస్తుపోతున్నారు. ఎందుకంటే చేపల మార్కెట్లో విక్రయాలు, కొనుగోళ్లు అన్నీ  చేపల రకం, వాటి సైజు, వాటి ఆకారం బట్టి విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణంగా చేపల మార్కెట్లన్నీ ఆదివారాలే కిటకిట లాడుతుంటాయి. చేపల వంట ఒకింత శ్రమతో, సమయం తీసుకునే పని కనుక. అటువంటిది సరిగ్గా ఆదివారం రోజే అధికారులు చేపల మార్కెట్లపై తనిఖీలంటూ పడ్డారు.

వందల మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ ఫిష్ మార్టులు దివాళీ తీస్తే మార్కెట్ లలో చేపలమ్ముకునే వారి దుకాణాలు ఎందుకు కిటకిటలాడాలి అన్న ఆక్రోషంతోనే ఈ దాడులంటూ చేపలమ్ముకునే వాళ్లూ, వనియోగదారులూ కూడా విమర్శలు చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి మేం ఫిష్ ఆంధ్రా మార్టులు పెడితే కొనరా.. అసలు మీకు చేపలెలా దొరుకుతాయో చూస్తామన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్రా మార్టులు కనీసం కరెంటు బిల్లు కట్టే పాటి ఆమ్మకాలు కూడా జరగక మూతపడుతుంటే.. చేపలమ్ముకునే చిన్న చిన్న అమ్మకాలు జోరుగా సాగడానికి ఎలా కుదురుతుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే అధికారులను మార్కెట్లపై దాడులకు ఆదేశించారనీ విపక్షాలు అంటున్నాయి. చేపల మార్కెట్లలో అమ్మకాలకు అవకాశం లేకుండా చేసి ఆంధ్రా ఫిష్ మార్ట్ లకు జనం వచ్చేలా చేయడానికే ఈ దాడులన్న విరమ్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చేపల వ్యాపారం జోరుగా సాగే ఆదివారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లపై దాడులకు ప్రభుత్వం ఉపక్రమించిందని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. చేతకాక మద్దెలు ఓడు అన్న చందంగా ప్రభుత్వం ఆంధ్రాఫిష్ మార్టులు మూత పడటానికి చేపల మార్కెట్లే కారణమని జగన్ ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.