ఎవరేమనుకుంటే నాకేం.. ఇదే జగన్ పర్కార్ తీరు

Publish Date:Aug 5, 2022

Advertisement

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వైసీసీ సర్కార్ వ్యవహరిస్తున్నది. పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కిమ్మనకుండా, ఆరోపణలకు గురైన వారిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్ ప్రజలకు ఏం చెబుదామనుకుంటోంది. గోరంట్ల మాధవ్ వ్యవహారమే తీసుకుంటే.. ఆయన దిక్కుమాలిన చర్య వల్ల పార్టీ పరువే కాదు.. రాష్ట్రం పరువు, పార్లమెంటు పరువూ కూడా గంగలో కలిసిపోయింది. చర్యలు తీసుకుని కొంతలో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న ఇంగితం కూడా వైసీపీలో కనిపించడం లేదు.

ఆయన న్యూడ్ కాల్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజు మాత్రం కఠిన చర్యలు అంటూ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన సజ్జల ఆ తరువాత నోరెత్తడం మానేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ సరేసరి, ఆయన తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల జగన్ చాలా సీరియస్ ఉన్నారన్న ఓ మాట చెప్పేసి ఊరుకున్నారు. అంతే గోరంట్ల మాధవ్ విషయాన్ని ఆ పార్టీ నేతలెవరూ ప్రస్తావించడానికే ఇష్టపడటం లేదు. ఇది వ్యూహాత్మకమేననీ, జనం ఈ విషయాన్ని మర్చిపోయేవరకూ మిన్నకుండటమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని ఈ వైఖరితో తేలిపోయింది.

ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరౌతున్నారు. పార్టీ పరంగా జరిగే సమావేశాలలోనూ పాల్గొంటున్నారు.   అంత అసహ్యంగా వీడియోలో బుక్కైన గోరంట్ల మాధవ్ పై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన వారూ విమర్శలు గుప్పిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా వైసీపీ పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీలో ఉన్న మహిళా నేతలకు కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు వైసీపీ దృష్టి అంతా మాధవ్ వ్యవహారం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మరల్చడమెలా అన్న దానిపైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లపై ఇటువంటి ఆరోపణలకు వచ్చినప్పుడు కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేస్తున్నారు.  

అంబటి, అవంతి విషయంలో అయినా ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఎప్పుడూ ఆలోచించలేదు.  ఇప్పుడు హిందూపురం ఎంపీ విషయంలోనే వైసీపీ అదే పంధాను అనుసరిస్తున్నది.  జనం ఏమనుకుంటారు, పార్టీ పరువు ఏమౌతుంది అన్న ఆలోచనే వైసీపీ దరికి చేరనీయదనీ, అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లిపోతుంది, ఎవరైనా నిలదీస్తే చేతిలో పోలీసులు ఉన్నారు.. కేసులు పెట్టి వేధించేయవచ్చన్నదే వైసీపీ ఆలోచనాధోరణిగా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిత్తూరు జిల్లా విద్యార్థిపై కేసు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.   

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.