మంగ్లికీ ఓ సలహాదారు పదవి

Publish Date:Nov 22, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల పదవుల నియామక మేళా జరుగుతోంది. వారానికి ఇద్దరు చొప్పున సలహాదారు పదవులలో నియమితులౌతున్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. అంతా నా యిష్టం అన్న రీతిలో విమర్శలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల జోరు పెంచేస్తున్నారు.

 తాజాగా ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదలో నియమించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. అలీ, పోసాని మురళిలక సలహాదారు పదవులు ఇచ్చిన జగన్ తాజాగా   మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీని నియమించారు.

వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే మంగ్లిని సలహాదారుగా నియమిస్తూ ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీ అనగానే ధర్టీ ఇండస్ట్రీస్ పృధ్వికి జరిగిన మర్యాద గుర్తొచ్చిందో ఏమో ఉత్తర్వులు వెలువడినా మంగ్లీ మాత్రం ఇంత వరకూ బాధ్యతలు చేపట్ట లేదు. చివరకు సమాధానపడి, నాలుగు రోజుల క్రితమే ఆమె ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మంగ్లీకి లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్.

ఇవి కాకుండా ఇతర ఫెసిలిటీస్ అదనం. ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్లపాటు  కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించిన సంగతి విదితమే.

కాగా ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా మంగ్లి నియామకం పట్ల మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తనదైన ప్రత్యేకత చాటుకుంటూ గాయనిగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న గాయని మంగ్లిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ )కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా(ఎస్వీబీసీ) ఏపీ ప్రభుత్వం నియమించడం చాలా ఆనందంగా ఉంది. మంగ్లి తన సాంగ్స్ తో  స్వామిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ మంగ్లీ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

By
en-us Political News

  
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.