ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని

Publish Date:Jan 16, 2026

Advertisement

గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని.  వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని   చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ   వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

 జగన్ పాలనా వైఫల్యం కారణంగానే   2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని  ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత  జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. 
అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో  ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.  

ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో  అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు.  అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా  కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు.

అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో? 

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.