చంద్రబాబుకు మేలు.. జగన్ తీరు!

Publish Date:Oct 24, 2025

Advertisement

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతే కాకుండా గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కువిమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికీ, తప్పదోవపట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి మేలు చేయవు సరికదా, ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తాయి.

ప్రత్యర్థి పార్టీగా వైసీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల రాజకీయంగా ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ వ్యవహరిస్తున్న తీరు.. అధికార కూటమికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎనలేని మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.  
 తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ విమర్శల వల్ల ఆయనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరనీ, ఎవరో చేసిన మంచి పనుల క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసేసుకుని, అంతా తానే చేశాన్న బిల్డప్ ఇచ్చుకుంటారనీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.

ఆయన వ్యాఖ్యలకు నెటిజనులు క్షణం ఆలస్యం చేయకుండా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.  కియా, విశాఖకు ఏఐ వంటి అంశాలలో తొలుత విమర్శలకు దిగిన జగన్ తీరా వాటికి ప్రజల నుంచి వచ్చిన అమోఘమైన సానుకూలతను గమనించి అవి తమ ఘనత వల్లే వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజనులు ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. అనంతపురానికి కియా రాక తన తండ్రి వైఎస్ దేననీ, అదానీతో తాను గతంలో జరిపిన చర్చల వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ వచ్చాయనీ జగన్ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు ఎన్నడూ వేరొకరి క్రిడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అప్పుడూ, ఇప్పుడూ కూడా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరునే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు. 

ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని చంద్రబాబు కొనసాగించారనీ, అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదనీ గుర్తు చేస్తున్నారు నెటిజనులు. ఇక హైదరబాద్ కు అదనంగా సైబరాబాద్ ఆవిర్భావం చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాలలో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పారు. నెటిజనులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ అసత్యాలను ప్రచారం చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ మైలేజ్ రావడం సంగతి అటుంచి ఉన్న ప్రతిష్ఠ కూడా మసకబారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.