జగన్ కు లోకేష్ భయం.. అందుకే ఆళ్లకు మళ్లీ రెడ్ కార్పెట్!

Publish Date:Feb 21, 2024

Advertisement

వరుసగా రెండో సారి అధికారం అందుకోవడం సంగతి దేవుడెరుగు.. మంగళగిరిలో నారా లోకేష్ వరుసగా రెండోసారి ఓటమి పాలైతే అదే   పది వేలు అనుకునే స్థితికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని.. మార్పులు చేర్పులూ కేవలం మంగళగిరిలోనే పార్టీ అధినేత వైయస్ జగన్ చేయడం చూస్తుంటే.. ఆయన తీరు అలాగే ఉందని  అంటున్నారు.

తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ  ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించడమే కాదు.. మంగళగిరి  అసెంబ్లీ నియోజకవర్గంలో  వైసీపీ గెలిచి తీరాలి, అందుకు ఏం చేస్తావో ఏమో అంటూ  పార్టీని మంగళగిరిలో గెలిపించే బాధ్యతలు ఆయన భుజస్కందాలపై  జగన్ పెట్టడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. 
ఇటీవల జగనన్నా నీకో దండం.. నీ పార్టీకో దండం అంటూ  వైసీపీకే కాదు.. ఆ పార్టీ తరఫున గెలిచినఎమ్మెల్యే పదవికి సైతం రాం రాం చెప్పేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆ తర్వాత.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు   షర్మిల పంచన చేరిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారంటూ  పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  అలాంటి వేళ మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి యూ టర్న్ తీసుకుని  వైసీపీలో చేరడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని పరిశీలకులు అంటున్నారు.

ఆళ్ల తొలుత పార్టీకి రాజీనామా చేయడంతో.. బయటకు వెళ్లితే వెళ్లారులే అని లెక్కలేసుకున్న తాడేపల్లి ప్యాలెస్‌లోని అగ్రనేతలు,  ఆ తర్వాత మంగళగిరిలో తాజాగా నెలకొన్న పరిస్థితులు చూసి.. ఒకింత షాక్ అయ్యారని.. ఆ క్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవిని మార్చి కాండ్రు కమలకు బాధ్యతలు కట్టబెట్టారని.. అయినా కూడా విజయంపై నమ్మకం కలగలేదని అంటున్నారు. దీంతో మంగళగిరిలో లోకేష్ ఓటమే లక్ష్యంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు రాయబారం పంపి.. మంతనాలు నెరిపి.. తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒప్పించారని, అయితే రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డినే బరిలో దింపేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. మంగళగిరి నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అలాగే 2019 ఎన్నికల్లో సైతం ఆయన వరుసగా రెండో సారి గెలిచారు. మళ్లీ అంటే.. 2024లో మంగళగిరి నుంచి ఆర్కేని బరిలో దింపి.. నారా లోకేష్ ను ఓడించేందుకు జగన్ అండ్ కో శతథా ప్రయత్నాలు చేస్తుందని వారు చెబుతున్నారు. 

అయితే గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి పాలైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తు వస్తున్నారని.. అలాగే అన్నా క్యాంటీన్లతోపాటు ఆరోగ్య సంజీవని పేరుతో మొబైల్ ఆరోగ్య సేవలను సైతం అందిస్తున్నారని.. ఇక మంగళగిరిలో నారా లోకేష్  భార్య నారా బ్రహ్మణి..టాటా తనేరా సీఈవోతో కలిసి వీవర్ శాలను ఇటీవల ప్రారంభించారని... అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు  ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగమేఘాల మీద స్పందిస్తు.. వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతేన్నాయనీ,  దీంతో రానున్న ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే ఓ ప్రచారం ఓ వైపు సాగుతోండగా.. మరోవైపు మంగళగిరిలో తెలుగుదేశం జెండా  రెపరెపలాడటం ఖాయమని సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని వారు వివరిస్తున్నారు. 

  తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి. అలాంటి నియోజక వర్గంలో నారా లోకేష్ విజయం సాధిస్తారన్న విషయాన్ని  సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారనీ,   ఆ క్రమంలోనే మంగళగిరిలో  పార్టీ అభ్యర్థి ఎంపికలో ఆయన తికమక.. మకతిక పడుతూ.. పార్టీని వీడి బయటకు వెళ్లిపోయిన ఆళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.