నాడు గెలిపించాయి.. నేడు ఓడిస్తాయి! జగన్ కు అన్నీ, అందరూ రివర్స్!

Publish Date:Jan 3, 2024

Advertisement

నిన్న మొన్నటి దాకా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారంటూ వచ్చిన వార్తలలో వాస్తవం ఎంత, ప్రచారం ఎంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతూ ఉండేవి. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు వంటి వారు మీడియా సమావేశంలో ప్రకటించేసినా కూడా షర్మిల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ లోకి వస్తారా? రారా? అన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి.

కానీ షర్మిల ఒకే ఒక్క మాటతో ఆ అనుమానాలన్నిటినీ నివృత్తి చేసేశారు. తనకు కాంగ్రెస్  నుంచి ఆహ్వానం ఉందనీ, ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తాననీ మీడియా సమావేశంలో విస్పష్టంగా ప్రకటించేశారు. అంతకు ముందు పార్టీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయిన షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత పులివెందుల వెళ్లిన ఆమె వైఎస్ సమాధి వద్ద తన కుమారుడి పెళ్లి శుభలేఖ ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం (జనవరి 3) తన సోదరుడు జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లి శుభలేఖ అందించనున్నారు. ఆ తరువాత ఆమె హస్తిన వెళ్ల నున్నారు.  తెలంగాణ ఎన్నికలలో తన వైఎస్సార్టీపీని పోటీ కి దూరంగా ఉంచడం కాంగ్రెస్ కు లాభించిందనీ షర్మిల చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏపీలో పార్టీని కాపాడాల్సిందిగా కోరుతున్నారనీ, అందుకు తనకు ఇసుమంతైనా అభ్యంతరం లేదనీ చెప్పారు. విలీనం, ఇతర అంశాలపై చర్చించేందుకే తాను హస్తిన వెడుతున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో రాజకీయాలు చేస్తే జగన్ పరిస్థితి ఏమిటి అన్నది చూస్తే..

గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో రివర్స్ పాలన సాగించిన జగన్ కు ఎన్నికల సమయం వచ్చే సరికి 2019 ఎన్నికలలో అనుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు రివర్స్ అవుతోంది. ప్రతి కూలంగా మారుతోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ విజయంలో మేజర్ క్రెడిట్ షర్మిలకు కూడా దక్కుతుందనడంలో సందేహం లేదు. జగన్ పాదయాత్ర, ప్రచారం, వాగ్దానాలూ అన్నీ ఒకెత్తు అయితే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం ఒక్కటీ ఒకెత్తు అని చెప్పాలి. 

 నాడు జగన్ విజయానికి ఎంతగానో దోహదపడిన షర్మిల ఇప్పుడు జగన్ కు రివర్స్ అయ్యారు. సొంత అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు.  ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించేందుకు సమాయత్తమౌతున్నారు. నేడో, రేపో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆమె ఏపీలో అడుగుపెట్టగానే ఆమె వెంట అడుగులు వేయడానికి మంగళగిరి ఎమ్మెల్యే, నిన్నటి వరకూ జగన్ కు నమ్మిన బంటు అన్నట్లుగా మెలిగిన ఆర్కే రెడీగా ఉన్నారు. ఇప్పటికే షర్మిల వెంటే తన అడుగులు అని ప్రకటించేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామా చేసేశారు.  నాడు జగన్ కోసం అమరావతిపై కేసులతో విషం కక్కిన ఆర్కే ఇప్పుడా కేసులను ఉపసంహరించుకోకతప్పని పరిస్థితి. షర్మిల వెంటే అని అడుగులు ప్రకటించిన ఆర్కే నిస్సందేహంగా కాంగ్రెస్ గూటికే చేరుతారు. అంటే ఏ నోటితో అయితే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారో అదే నోటితో ఇప్పుడు ఆయన అమరావతికి జై కొట్టక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నిటిలోనూ అత్యంత ముఖ్యమైనది ప్రత్యేక హోదా, అమరావతి రాజధానికి కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. దీంతో ఇప్పుడు అనివార్యంగా ఆర్కే రాజధాని అమరావతికి అనుకూలంగా గళమెత్తక తప్పదు. అంటే తన చేత జగన్ అమరావతికి వ్యతిరేకంగా బలవంతంగా ప్రకటనలు చేయించారనీ, కేసులు పెట్టించారని చెప్పాల్సి ఉంటుంది.

అంతే కాకుండా ఆ కేసులను కూడా ఉప సంహరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే షర్మిల సూచన మేరకు కేసుల ఉపసంహరణకు ఆర్కు అంగీకరించారని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ చెప్పినట్లు దేవుడి స్క్రిప్ట్ జగన్ కు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేసినట్లేనని చెప్పాలి.  ఇక 2019 ఎన్నికలలో జగన పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేసిన బాబాయ్ హత్య కేసు, జగన్ పై కోడికత్తి దాడి కేసులు ఇప్పుడు జగన్ మెడకే చుట్టుకున్నాయి. బాబాయ్ వైఎస్ వివేకా హత్య  సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది కోర్టులు తేల్చాల్సి ఉన్నప్పటికీ వారెవరన్న విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్ధమైపోయింది. బాబాయ్ హత్య కేసులో జగన్ ఎవరిని కాపాడుతున్నారో, ఎవరికి అండగా నిలుస్తున్నారో కూడా స్పష్టమైపోయింది. దీంతో నాడు సానుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు ఆయనకు రివర్స్ గేర్ లో ఎదురు నిలుస్తోంది. నాడు విజయానికి దోహదపడిన అంశాలే ఇప్పుడు ఆయనకు మరో చాన్స్ దక్కే అవకాశం లేకుండా అడ్డం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.