Publish Date:Feb 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఔను.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పరిస్థితి అప్పటి నుంచీ కూడా జారుడుబండమీద నిలబడినట్లుగానే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. మరి కొందరు రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వలసల ఉధృతి చూస్తుంటే.. సమీప భవిష్యత్ లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం, అలాగే షర్మిల దూకుడుకు బ్రేకులు వేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే.. వైసీపీని వీడే వాళ్ల గురించి పట్టించుకోకుండా, బయట నుంచి నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు.అలా వచ్చేందుకు రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రెడీగా ఉన్నారు.
గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత మేర పుంజుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో నిరాశ, నైరాశ్యం, నిస్ఫృహలు అలముకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే గతంలో రాష్ట్ర కాంగ్రెస్ లో చక్రం తిప్పిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా వారు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు సరికదా.. కనీసం పార్టీ కార్యాలయంవైపు కూడా కన్నెత్తి చూడటంలేదు. అలాంటి వారిపై జగన్ దృష్టి పెట్టారు. వైసీపీలోకి వస్తే వారి సీనియారిటీకి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇస్తూ వారిని ఫ్యాన్ గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకున్నారు.
ఇప్పుడిక ఆయన కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేశారని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది. వైసీపీలోకి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వంటి వారు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మాజీ ఎంపీ హర్షవర్థన్ ను కూడా జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు.
సీనియర్ల చేరికతో వైసీపీలో కొత్త ఊపు వస్తుందని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే గత ఐదేళ్ల జగన్ పాలనపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యిందో చూసిన తరువాత కాంగ్రెస్ సీనియర్లు ఆయన పంచన చేరే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అయినా కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు వైఎస్ కుమార్తె చేతిలో ఉన్నందున వైఎస్ ను నిజంగా అభిమానించే నేతలెవరూ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరే అవకాశాలు లేవని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-eyes-congress-seniors-39-192826.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.