డాక్టర్ ప్రియాంక.. గొర్రెల కాపరి దానయ్య.. రాజకీయం కోసం జగన్ ద్వంద్వ వైఖరి?

Publish Date:Aug 10, 2026

Advertisement

రాజ మహూంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ను  కారుతో ఢీకొట్టి దారుణ హత్యకు గురి చేసిన సంఘటన   రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి విదిమే.   ఈ కేసును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిండానికి వైసీసీ అధినేత చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న  ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకడైన న ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఒక పాపస్టర్ కుమారుడు కావడమేనంటున్నారు.వాస్తవానికి విషయంతో సంబంధం లేకుండాప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం వైసీపీ ఎకోసిస్టమ్లో భాగంగా మారిపోయింది. 

రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో  నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది. రెండుసంఘటనల్లోనూ ఆయన   స్పందన వేరువేరుగా ఉంది. కాశీబుగ్గ ఘటనలో నిందితులకు అనుకూలంగా, రాజమహేంద్రవరం సంఘటనలో మరోలా మాట్లాడుతున్నారు.

ఆయన మాటల్లోని వైరుధ్యాన్నీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్న తీరునూ గమనిస్తే.. జగన్ నిందితులకు  మద్దతుగా మాట్లాడుతూ, రాజకీయంతోనూ, ప్రభుత్వంతోనూ ఏమాత్రం సంబంధం లేని సంఘటనలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పకతప్పదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండుసంఘటనల్లోనూ కూడా నిదితులు మద్యం మత్తు, నిర్లక్ష్యం, అహంకారంతో వాహనం నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇసుమంతైనా లేదు.  

ముందుగా కాశీబుగ్గ సమీపంలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయానికి వస్తే..  ఆ సంఘటనలో ఒక పేద గొర్రెల కాపరి దానయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సందర్భంగా  వైసీపీ అధినేత జగన్  వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. తొలుత  సొంత పార్టీ నేత కుమారుడిని రక్షించేందుకు వేరొక అనామకుడిపై నింద మోపే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉన్న దానయ్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోలేదు. కుమారుడిని కాపాడేందుకు, కేసును తప్పుదోవపట్టిచేందుకు ప్రయత్నించిన   సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే..  దాన్ని రాజకీయ కక్ష సాధింపు గా జగన్ రెడ్డి  అభివర్ణించి విమర్శల పాలయ్యారు.  బాధితుడైన గొర్రెల కాపరి కుటుంబం ఆవేదనను పక్కనపెట్టి, కేవలం తమ పార్టీ నేత, కుల సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. సీదిరి అప్పలరాజు, అతడి కుమారుడిపై కేసు పెట్టడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా, మత్స్యకార నాయకుడ్ని వేధించడంగా  అభివర్ణించారుర. 

ఇక తాజాగా రాజమహేంద్రవరం ఘటనలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన  వారిలో ఒక నిందితుడు..  తనకు కీలకమైన  ఓటు బ్యాంకువర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈ ఘటనలో మరణించిన ప్రియాంక వైద్య విద్యార్థిని కావడంతో  ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడిన జగన్ చివరికి ప్రభుత్వాన్నినిందిస్తూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.  జోసెఫ్ ఎడ్వర్డ్స్ కుటుంబం సామాజికంగా, మతపరంగా వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో రాజమమేంద్రవరం కేసులో  నిందితులకు కఠిన శిక్ష పడాలని, వైసీపీ చేస్తున్న డిమాండ్లు మాటవరసేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే..  కాశిబుగ్గ కేసులో అప్పలరాజు కొడుకుపై చట్టం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించిన జగన్.. ప్రియాంక విషయంలో  అందుకు భిన్నంగా స్పందిస్తారని ఎలా భావించగలమని అంటున్నారు.  

 ప్రియాంక తండ్రి కడుపు కోతతో మాట్లాడుతున్న మాటలను  రాజకీయం చేసి లబ్ధి కోసం పాకులాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు, ఒక నిందితుడు తమ పార్టీ నేత కొడుకైనా, లేక ఓటు బ్యాంకుకు చెందిన ప్రముఖుడి కొడుకైనా శిక్ష ఒకేలా ఉండాలి.. జగన్ డిమాండ్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి కదా అంటున్నారు.   బాధితురాలైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఏపీవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, వైసీపీ ద్వంద్వ వైఖరి ఆ పార్టీ విశ్వసనీయతను మరింత మరింత మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో బాధితుడికి ఒక న్యాయం, రాజమహేంద్రవరం ప్రియాంక కేసులో మరో న్యాయం అన్నట్లుగా జగన్ రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Jagan double standards, Politics, Hit and Run, Sidiri Appalaraju Son, Doctor Priyanka

By
en-us Political News

  
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.