జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా.. పార్టీ నేతల వ్యతిరేకతే కారణమా?

Publish Date:Jan 2, 2025

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ క్యాడర్, నేతలు వణికి పోతున్నారు. ఇప్పుడప్పుడే వద్దు మహప్రభో అంటూ వేడుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన బయటకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టుకుని జనం ముఖం చూడటానికి కూడా ఇష్టం లేని విధంగా వ్యవహరించారు. ఇక ఎన్నికలకు ముందు సిద్ధం సభల కోసం ఆయన బయటకు వచ్చినా.. ఆ సభలకు బెదరించి మరీ డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పథకాల లబ్ధిదారులను బెదరించి సభలకు తీసుకువచ్చేవారు. ఇది పక్కన పెడితే ఆయన పర్యటనల కోసం జనాలను తరలించడం అన్నది పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారిపోయేది. 

ఇక పథకాలకు బటన్లు నొక్కేందుకు ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభలకు పార్టీ నేతలు తరలించిన జనాలు జగన్ ప్రసంగం ప్రారంభించగానే పారిపోయేవారు. వారిని ఆపడానికి పోలీసులు, పార్టీ క్యాడర్ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించేవి కావు. ఇక  పార్టీ పరాజయం తరువాత ఆయన జనం ముందుకు వచ్చే ధైర్యం చేస్తారని ఎవరూ భావించలేదు. పార్టీ నేతలూ క్యాడర్ కూడా ఇహ ఇప్పట్లో జగన్ సభలు ఉండవు, జనాలను తరలించే బాధ తప్పుతుందని ఆనందించారు. అయితే జగన్ మాత్రం ఉరుములేని పిడుగులా జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రతి బుధ గురువారాలలో ఈ పర్యటనలు ఉంటాయని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలు జనంలో పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ, క్యాడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికేనని ఆయన చెప్పారు. అయితే పార్టీ నేతలూ, కార్యకర్తలు మాత్రం ఆయన పర్యటనలను స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే పర్యటనలు వద్దు సార్ అంటూ ఆయనకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న మాట.

 ఈ నెల చివరి వారం నుంచి తన జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రకటించిన జగన్ ఆ పర్యటనలకు జగనన్న విత్ క్యాడర్ అని నామకరణం కూడా చేశారు. ఘోర పరాజయం నుంచి తేరుకుని ఇంత త్వరలో ఆయన జనంలోకి వస్తానంటూ చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులనే కాదు, సొంత పార్టీ క్యాడర్ ను కూడా ఆశ్చర్య పరిచింది.ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలతో, పార్టీ క్యాడర్ తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్, ఇప్పుడు జనంలో ఏమాత్రం ఆదరణ లేని పరిస్థితుల్లో, క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిన సమయంలో జిల్లాల పర్యటన పెట్టుకోవడం ఏమిటి? అసలాయన పర్యటన ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలు ముందుకు వస్తారా? అన్న అనుమానాలూ సర్వత్రా వ్యక్తం అయ్యాయి.  

సరే ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా జగన్ చెప్పా పెట్టకుండా తన జిల్లాల పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు నేతల నుంచి కానీ, క్యాడర్ నుంచి కానీ తన జిల్లాల పర్యటన ప్రకటనకు ఇసుమంతైనా స్పందన కానకారపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ జిల్లాల పర్యటనలకు ఏర్పాటు చేయడం తమ స్థోమతకు మించిన పనిగా మారుతుందని పార్టీ నేతలు భయపడ్డారు. అధికారం చేతిలో లేనందున జనాలను కూడా తరలించే పరిస్థితి ఉండదని జగన్ కు పార్టీ నేతలు నివేదించడంతోనే ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సరే పార్టీ నేతలూ, క్యాడరే వద్దంటున్నారని చెప్పుకోలేక జగన్ తన పర్యటన వాయిదా కోసం లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తెల వద్దకు వెళ్లనున్నట్లు, అందుకే జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.

అసలు జగన్ పర్యటనలపై ప్రకటన చేయడం, ఆ తరువాత సరైన కారణం లేకుండానే వాటిని వాయిదా వేయడం అన్నది ఆయన అధికారంలో ఉన్నటప్పటి నుంచీ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.