అయినా మనిషి మారలేదు అతని తీరు మారలేదు!

Publish Date:Feb 6, 2025

Advertisement

సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం ఆయనకు నీ సేవలించ చాలు జగన్ బాబూ అని పక్కన పెట్టేశారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించి   నీకు మా తరఫున మాట్లాడే అర్హత కూడా లేదు అని  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చెప్పకనే చెప్పారు. అయినా ఆ విషయం అర్ధం చేసుకోలేని జగన్ జనం కోరుకున్నదే చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ప్రజల తరఫున తాను మాట్లాడనని భీష్మించారు. 

జగన్ పార్టీ ఘోర పరాజయం పాలై ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ జగన్ కు ప్రజలను తనను ఎందుకు ఓడించారో అర్ధం కాలేదు. ఎవరైనా చెప్పబోయినా ఆయన ఎవరి మాటా వినరాయె. అందుకే ఆయన తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది వినాల్సిందే.. వేరే వారు ఎవరైనా మాట్లాడితే ఆయన వినరు. ఇప్పుడు తాజాగా గురువారం (ఫిబ్రవరి 6) ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తరువాత తొలి సారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం అంటే పొరబడతారేమో.. జగన్ తాను ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి తనకు అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆ ప్రెస్ మీట్ కు వచ్చన వారంతా ఆయన చెప్పింది విని రాసుకుపోవడం తప్ప మాట్లాడడానికీ, ప్రశ్నలు అడగడానికి ఇసుమంతైనా అవకాశం ఉండదు. గురువారం కూడా జగన్ అలాంటి ప్రెస్ మీట్ లోనే దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. 

ఈ రెండు గంటల ప్రసంగం కూడా సింగిల్ పాయింట్ ఎజెండా కేంద్రంగానే సాగింది. మళ్లీ ప్రసంగం అంటే ఆశువుగా తాను చెప్పదలచుకున్నది చెప్పేశారనుకునేరు. కాదు కాదు. రాసుకొచ్చిన లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివారు. ఆ స్క్రిప్ట్ మొత్తం తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ఉంది. తాను బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గొప్పగా సంక్షేమం అమలు చేశాననీ, చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని మూలన పడేసిందన్నదే ఆయన రెండు గంటల ప్రసంగ సారాంశం. 
మరి అంత గొప్పగా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని జనం ఎందుకంత ఘోరంగా ఓడించారు? ఈ ప్రశ్న ఆ మీడియా మీట్ కు హాజరైన వారెవరూ అడలేదు. అడిగినా ఉపయోగం లేదని వారికి తెలుసు. కనీసం జగన్ కి అయినా ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ సందేహం వచ్చిన దాఖలాలు లేవు. 

వాస్తవమేమిటంటే కేవలం ఉచితాలను అందించి అదే సంక్షేమం, అభివృద్ధి అంటే జనం ఆమోదించరనీ, అంగీకరించరనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు తమ తీర్పుతో విస్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయం అర్ధం చేసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినరు మరి. ఇక విషయానికి వస్తే జగన్ కు పరిపాలన అంటే బటన్ నొక్కడం మాత్రమే. అదొక్కటే సరిపోదని ప్రజలిచ్చిన తీర్పును ఆయన పట్టించుకోరు. తనలా చంద్రబాబు బటన్ లు ఎందుకు నొక్కడం లేదని మాత్రం ప్రశ్నిస్తారు. ఆయన ఇదే తీరులో కొనసాగితే మాత్రం 2024లో ఎదురైన ఘోర పరాభవ పరాజయాన్ని మించిన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన ఆ దిశగానే ముందుకు సాగుతున్నారనడానికి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీ ఎందకు మీడియా ఉందిగా అన్న ఆయన మాటలే తార్కానం. ఈ మీడియా సమావేశం ద్వారా భవిష్యత్ లో కూడా తాను అసెంబ్లీకి హాజరు కాబోనన్న స్పష్టత ఇచ్చారు. తానే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి హాజరు కారన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు.  అంతే జగన్ ఎవరి మాటా వినరు.  అంతే కాదు.. ఎన్ని పరాభవాలెదురైనా మారరు. అంతే జగన్ అంటే అంతే మరి.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (మార్చి 21) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది.
ఛత్తీస్ గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి.
 టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్  టీమ్ లో చేరలేదు
మన దేశం మరో మారు మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది. అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.
 టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  నిందితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  మూడు రోజుల పాటు సిఐడి కస్టడీ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారి చేసింది.
ఫోట్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్‌ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి అందరివాడుగా నిలిచిన మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీర్తికిరీటంల మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు అందుకున్న చిరంజీవి తాజాగా బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రజాప్రతినిథులు, ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు.
వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.