జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ!

Publish Date:Aug 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది గంటలలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం జగన్ హస్తిన పర్యటనను బయలుదేరుతారు.  రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేసి సోమవారం (ఆగస్టు 22) ఉదయం  పదిన్నర గంటలకు గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కూడా సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు.  అలాగే అందుబాటులో ఉన్న కొందరు కేంద్ర మంత్రులను కూడా  జగన్ కలసే అవకాశాలున్నాయి.   రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ద్రౌపది మర్ము అమరావతి  వచ్చిన సందర్బంగా సీఎం జగన్ ఆమెకు తన నివాసంలో తేనేటి విందు ఇచ్చి సత్కరించారు.

ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో నూతన రాష్ట్రపతితో జగన్ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. కాగా   ప్రధాని మోదీతో భేటీలో   జగన్ కీలక అంశాల పైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్య..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ,  సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై జగన్ మోడీతో చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇవి కాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా ప్రదాని మోడీ చంద్రబాబుల భేటీ తరువాత విస్తృతంగా ప్రచారం అవుతున్న రాజకీయ సమీకరణాల మార్పు అంశంపై జగన్ ప్రధాని నుంచి క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.