జగన్ డిల్లీ పర్యటన.. మరిన్ని అరెస్టులకు సంకేతమేనా?

Publish Date:Oct 3, 2023

Advertisement

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది. స్వయంగా వైసీపీ వర్గాలే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఆశీస్సులు జగన్ కు ఉన్నాయనీ, ఈ అరెస్టుల పర్వం చంద్రబాబుతోనే ఆగదనీ బాహాటంగానే చెబుతున్నారు. కేసుల పేర్లు, సెక్షన్లు ఉటంకిస్తూ తరువాత అరెస్టు ఎవరిదో వారు చెప్పేస్తున్నారు కూడా.

సరిగ్గా ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఖరారయ్యయని చెబుతున్నారు.   అన్నీ కుదిరితే  శుక్రవారం (అక్టోబర్6) జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నిజానికి గత వారమే జగన్ ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నించారు. విదేశీ పర్యటనలు ముగించుకుని రాష్ట్రానికి రాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు వెడతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే ఢిల్లీ పెద్దల నుండి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దల అనుమతి, అపాయిట్ మెంట్లు దొరకడంతో జగన్ రెడ్డి హస్తిన ప్రయాణం ఖరారైంది.   ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. కాగా, జగన్ హస్తిన పర్యటనపై రాజకీయ వర్గాలలో పలు విధాల చర్చలు జరుగుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అక్రమ   అరెస్ట్ , ఈ నెలలోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన  ఆసక్తికరంగా మారింది.

 బీజేపీ మద్దతుతోనే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశారన్న భావన అన్ని వర్గాలలోనూ వ్యక్తమౌతున్నది.  ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేశారంటే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతెందుకు కేంద్ర పెద్దల మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశామని వైసీపీ నేతలే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అదే పెద్దలను కలవనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది.  వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరగనున్నది,  అదే సమయానికి జగన్ కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఢిల్లీ నుండి ఏపీకి ఎలాంటి సంకేతాలు అండనున్నాయన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

 మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, మార్గదర్శి ఎండీ శైలజ వంటి వారిని కూడా జైలుకు పంపాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారని వైసీపీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి అరెస్టుకు కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు  ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ కోసం కూడా జగన్ హస్తిన పర్యటనకు వెళుతున్నారని అంటున్నారు. అందుకోసమే  ప్రత్యర్థుల్లోని బలమైన నేతలను జైలుకు పంపి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం తోనే హస్తిన పెద్దల ఆశీస్సులు, అనుమతి కోరేందుకే జగన్ హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు అక్రమ ఆస్తుల కేసులు, వివేకా హత్యకేసు వంటి సొంత కేసులు, అదానీ ప్రాజెక్టులు తదితర అంశాల సీఎం జగన్  ఢిల్లీ పర్యటన వెనక కారణాలు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏ నెలకి ఆ నెల జీతాలు, పెన్షన్లు వంటి అతి సామాన్య ఖర్చులకు కూడా తెగ కసరత్తులు చేయాల్సి వస్తుంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా సరిపోనంత నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే చేయాల్సిన  స్థాయిని మించి అప్పులు చేయగా ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కష్టాలు ప్రభుత్వానికి తీరని నష్టం కాగా మరికొన్ని రోజులు ప్రభుత్వం నడిచేలా పెద్దల ఆశీస్సుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్ లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఏ మేరకు వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.