Publish Date:May 11, 2022
మాట తప్పను..మడమ తిప్పను అంటూ గోప్పగా చెప్పుకునే ఏపీ సీఎం.. వరుసగా మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. ఏపీ రాజధాని అమరావతే అన్న వాగ్దానం నుంచి ఈ మూడేళ్ల కాలంలో ఆయన మాట తిప్పని, మడమ తిప్పని సందర్భం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేస్తున్నట్లే కనిపిస్తూ.. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ వచ్చారు. వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ ఆయన మాట తిప్పి మడమ తిప్పి తాతా అవ్వలను నిలువునా మోసం చేశారు. ఇలా ఏ విషయం చూసుకున్నా చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటోంది.
ఇప్పుడు తాజాగా ఆయన వాలంటీర్ల ప్రొబేషన్ విషయంలో మళ్లీ మాట తప్పి మడమ తిప్పారు. వాలంటీర్ వ్యవస్థ తన మానస పుత్రికగా గొప్పగా చెప్పుకునే జగన్ వారికి ప్రొబేషన్ ఇచ్చే విషయంలో ముందు వెనుకలాడుతున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. వారి జీవితాలను చిందర వందర చేసేదిగా ఉంది. ప్రొబేషన్ ఇవ్వడానికి అనధికారికంగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొని..అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ ప్రొబేషన్ స్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా జూన్ నుంచి అందరికీ ప్రొబేషన్ ఇస్తామని అన్నారు. వాలంటీర్లు నమ్మారు. అయితే ఇప్పుడు ప్రొబేషన్ కు అర్హులు ఎవరో చెప్పాలంటూ జిల్లా యంత్రాంగాలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంటే గతలో అనధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతగా వాలంటీర్లకు ప్రొబేషన్ ఇస్తారన్న మాట.
అంటే వాలంటీర్లందరికీ ప్రోబేషన్ ఇస్తామన్న మాటను జగన్ తప్పారు. ఇచ్చిన హామీ విషయంలో మడమ తిప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వచ్చారు. వారి సర్వీస్ రికార్డులో కానీ..జాయినింగ్ రిపోర్టులో కానీ రెండేళ్ల తర్వాత మరోసారి పరీక్షలు పెడతాం… అందులో పాసయితేనే ప్రొబేషన్ ఇస్తామనే షరతు ఎక్కడా పెట్టలేదు. పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలో చేరే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారనే ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచాయో లేదో.. వారికి ఉద్యోగ భద్రత లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.
పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారంటూ వాలంటీర్లలో కనీసం ముఫ్పై శాతం మందిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వాన్ని నమ్మి మంచి భవిష్యత్‌ను వదులుకుని సొంత ఊరిగా ఉద్యోగం అన్న ఆశతో గ్రామ, వార్డు సచివాలయాల్లో కేవలం పదిహేను వేలరూపాయల జీతానికి పని చేస్తున్న వాలంటీర్లను నిలువునా ముంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-decieve-valunteers-39-135736.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.