Publish Date:Jul 26, 2024
మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అక్షరాలా ఆరులక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను తన ఆర్థిక అరాచకత్వంతో జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చేశారు. 2019మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 3లక్షల 75 వేల 975 కోట్ల రూపాయలు కాగా, 2019 మే లో జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగే సమయానికి రాష్ట్ర అప్పులు 9 లక్షల 74 వేల 556 కోట్ల రూపాయలు. అంటే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వీటిలో ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.4,38,278లు కాగా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 2,48,677 రూపాయలు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (జులై26) విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన గణాంకాలివి.
ఈ సందర్భంగా చంద్రబాబు.. అప్పుల పద్దు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అప్పులు చాలా ఉన్నాయన్నారు. జగన్ నిర్వాకం కారణంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం కారణంగా 52 వేల 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ఈ 52, 900 కోట్ల రూపాయల నష్టంలో 45 వేల కోట్లు ఆయకట్టకు నీటి సరఫరాలో జాప్యం వల్ల వాటిల్లిందనీ, 4900 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీ, రిపేర్ల వల్ల వాటిల్లింది. జల విద్యుత్ ఉత్పత్తిలో జాప్యం వల్ల 3వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. శ్వేతపత్రం ద్వారా ఈ వివరాలన్నీ వెల్లడించిన చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి జీఎస్పీపీ కాంట్రిబ్యూషన్ ద్వారా 52వేల 900 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. అమరావతి పనుల నిలుపు దల వల్ల ప్రభుత్వానికి రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-debts-in-5-years-25-181569.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి