సమీక్షల ప్రహసనం.. జగన్ మాటలపై నమ్మకం కోల్పోయిన క్యాడర్!?

Publish Date:Nov 16, 2022

Advertisement

 రాజుగారి దేవతా వస్త్రాల కథలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎంత రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ.. భుజ కీర్తులతో తమ అధినేతను ఆకాశానికి ఎత్తేసే వంది మాగధులు ఉన్నా.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి పై సమీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. అందుకే అనివార్యంగా నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

గుర్తుకు వచ్చినప్పుడు నచ్చిన నియోజకవర్గం నుంచి తను మెచ్చిన ఓ 50 మందిని తాడేపల్లికి పిలిపించుకుని ప్రసంగాలిచ్చేసి పంపించేస్తున్నారు. అయితే  ఎన్నికల కసరత్తులంటూ జగన్ చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలపై పార్టీ కేడర్ ఆసక్తి కోల్పోయింది. ఆయన మాటలు వారిలో విశ్వాసం నింపడం లేదా? అసలు సమీక్ష అంటేనా.. వారు ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటున్నారా? అయినా వైసీపీ అధినేత జగన్ దృష్టిలో నియోజకవర్గ సమీక్ష అంటే ఆ నియోజకవర్గం మొత్తం నుంచి తనకు నచ్చిన, తనకు సమస్యల చిట్టా విప్పరన్న నమ్మకం ఉన్న ఓ 50 మందిని ఎంపిక చేసి తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడమే. సమీక్షలో మరో కండీషన్ కూడా ఉంది. ఎవరూ మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. చెప్పింది వినాలి అంతే.

అందుకే వైసీపీ శ్రేణులే జగన్ నిర్వహిస్తున్న సమీక్షలపై జోకులు వేసుకునే పరిస్థితి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాం.. మరొక్క చాన్స్ అంటూ జనంలోకి వెళ్లండి. ఈ సారి అధికారం అందుకుంటే.. ఇక అంతే మనల్ని ఎవరూ కదపలేరు. మూడు దశాబ్దాల పాటు మనదే అధికారం అంటే ఆ వచ్చిన వారిలో ఉత్సాహం నింపడానికి జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. బటన్ నొక్కి కోట్లకు కోట్ల రూపాయలు పందేరం చేస్తున్నా.. మనకు ఓట్లు ఎందుకు రావు.. 175కు 175 అసెంబ్లీ స్థానాల్లోనే మనం ఎందుకు గెలవం.. మీరు నియోజకవర్గంలో పని చేయండి చాలు మిగతాదంతా (బటన్ నొక్కడం) నేను చూసుకుంటాను అంటూ భరోసా నింపేస్తున్నారు. అయితే ఈ ప్రసంగాలేవీ క్యాడర్ లో అసంతృప్తిని చల్లార్చడం లేదు.

నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారంతా జగన్ కు వీర విధేయులే అయినా.. వారు కూడా మధ్య మధ్యలో జగన్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను ఏకరవు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే జగన్ కు నచ్చడం లేదు. నేను చెబుతున్నాను కదా అన్నట్లు ఓ లుక్కేసి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించడం అంటూ సీఎంవో అధికారులను ఆదేశించేస్తున్నారే తప్ప ఆ సమస్య ఏమిటన్నది కూడా వినిపించుకోవడం లేదు. ఎన్నో ఫిల్టర్ల తరువాతే జగన్ నియోజకవర్గ సమీక్షలకు వచ్చే క్యాడర్ ను ఎంపిక చేస్తున్నారు.

వారెవరూ కచ్చితంగా నోరెత్తరని నిర్ధారణ చేసుకునే.. అందుకు అనుగుణంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వారిని జగన్ సుముఖానికి అంటే సమీక్షకు పిలుస్తున్నారు. అయినా కూడా ఈ సమీక్షల్లో అంత ఫిల్టరై వచ్చిన వారు కూడా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విజయం కష్టం అన్నసూచనలూ  ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం అవన్నీ మీరు పట్టించుకోవద్దు.. సమస్యలు పరిష్కారమౌతాయి.. పందేరాలు కొనసాగుతాయి.. మనదే విజయం.. అందుకు మీరు చేయాల్సింది ఐక్యంగా పని చేయడం అంటూ వారి నోరు మూయిస్తున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగానే క్యాడర్ లో కూడా పని చేసే ఉత్సాహం అడుగంటి పోయిందంటున్నారు.

ఆయన ఎలాగూ బటన్ నొక్కుతున్నారుగా.. ఇక మనం పని చేసేదేముంది  అంటూ సరదా వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నెలకొని ఉందని వైసీపీ వర్గాలే అంతర్గత  సంభాషణల్లో చెబుతున్నాయి. జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పగటి కలో, ఆత్మ విశ్వాసమో తెలియదు కానీ విజయంపై తనకున్న ధీమాను క్యాడర్ లోనూ కలిగించేందుకు సమీక్షల పేర ఉద్బోధలు మాత్రం నిరాటంకంగా చేసుకుంటూ పోతున్నారు.

కానీ పార్టీలో మాత్రం సమీక్షల తీరు మారాలనీ, పెద్ద సంఖ్యలో క్యాడర్ ను సమీక్షలకు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పిల్ల మెడలో గంట ఎవరు కడతారు? జగన్ మాటలు దేవతావస్త్రాల్లా ఉన్నాయని ఎవరు చెబుతారు? ఈ ప్రశ్నకు పార్టీ నేతలు ఎవరి నుంచీ సమాధానం ఉండదు. అంతా గప్ చిప్

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.