ఆక్షేపించడానికేం లేకేనా.. బాబు వయస్సుపై జగన్ వ్యాఖ్యలు?

Publish Date:Sep 26, 2025

Advertisement

తెలుగు దేశం పార్టీ అధినేత,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన దార్శనికతను  రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఈ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ  అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను  ఉపయోగించిన తీరును మేధావులూ, ప్రగతి కాముకులు ప్రశంసిస్తూనే ఉంటారు. ప్రస్తుతిస్తూనే ఉంటారు. దీంతో జగన్ కు చంద్రబాబుపై విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు వయస్సుపై కామెంట్లు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు.

ఇక ఆయన వయస్సు విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్లు. అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన ఆయనలో నిత్యం ప్రస్ఫుటిస్తుంటాయి. అటువంటి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆయన    ముసలాయన  అంటున్నారు. ఆయనను వృద్ధుడు అనడం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది తెలియదు కానీ..  చంద్రబాబు మాత్రం  తాను నిత్యయవ్వనుడినని తన తీరుతో, పని విధానంతో  పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజలు సైతం ఆయన ఉత్సాహాన్ని, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న ఉత్సుకతను, నిబద్ధతను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తున్నారు.  అదే సమయంలో   జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  అత్యంత అరుదుగా తప్ప పర్యటన చేసే వారు కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ లకే పరిమితం అవుతున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. 

అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమౌతూ ప్రజాక్షేత్రంలో, అధికారిక కార్యక్రమాలలో నిరంతరం బిజీగా ఉంటారు. ఉంటున్నారు. అందుకు ఉదాహరణగా బుధవారం (సెప్టెంబర్ 24) గురువారం(సెప్టెంబర్25) ఆయన బిజీ షెడ్యూల్ ను గమనిస్తే సరిపోతుంది.   
ముందుగా బుధవారం చంద్రబాబు క్షణం తీరిక లేని షెడ్యూల్ ను చెప్పుకుంటే.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాథాకృష్ణన్ కు విమానాశ్రయంతో స్వాగతం పలకడం తో మొదలైంది.  ఆ తరువాత చంద్రబాబు సకుటుంబ సమేతంగా  మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. అక్కడ నుంచి.. విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.

 ఆ తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు. అక్కడ నుంచి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక గురువారం (సెప్టెంబర్ 25) ఉదయమే ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి అమరావతి చేరుకుని అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నారు. సాయంత్రం డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో కూడా ఆయనలో ఎక్కడా అలసట చ్ఛాయలు కూడా కనిపించలేదు. ముఖంపై చిరునవ్వు చెరగలేదు.  ఒక రోజు పర్యటిస్తే రోజుల తరబడి ప్యాలెస్ కే పరిమితమయ్యే జగన్ చంద్రబాబు వయస్సుపై వ్యాఖ్యలు చేయడమేంటంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.