Publish Date:Jul 28, 2022
పూటకో మాట.. రోజుకో వేషం అన్నట్లగా ఉంది జగన్ తీరు. ప్రజలలో జగన్ సర్కార్ పై విశ్వసనీయత కోల్పోతున్న సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వారిని మళ్లీ వైసీపీవైపు మళ్లించడానికీ, తన పై విశ్వసనీయత పెరిగేలా చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
గత ఎన్నికలకు ముందు ఇళ్లూ వాకిలీ వదిలేసి నిత్యం జనంలోనే తిరిగి ఒక్క చాన్స్.. ఒకే ఒక్కచాన్స్ అంటూ అదేదో సినిమాలో హీరోయిన్ లా జనాలను ప్రాధేయపడిన ఆయన తీరా అధికారం చిక్కిన తరువాత జనం మొహం చూసిన సందర్భాలు అతి స్వల్పం. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడమే గగనం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. గత ఎన్నికలకు ముందు జనంలో తిరుగుతూ అవ్వలు, తాతలు, అక్కమ్మలు, చెల్లెమ్మలు అంటూ కనిపించిన వారికల్లా ముద్దులు పెట్టి, నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించిన జగన్... అధికారంలోకి వచ్చిన తరువాత ముద్దులు, ఆశీర్వచనాల సంగతి అలా ఉంచి పన్నులు, వడ్డింపులూ అంటూ గుద్దులు మొదలెట్టారు.
మూడేళ్లు గడిచిపోయిన తరువాత ఇప్పుడు మళ్లీ జనం గుర్తుకు వచ్చారా అని జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా చేసిన హడావుడి, మళ్లీ జనంలో మమేకం కావడానికి పడిన తాపత్రయం చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటనలో ‘సెలెక్టడ్’ జనం మాత్రమే ఆయన దగ్గరకు వెళ్లగలిగారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజమైన వరద బాధితులెవరూ జగన్ పర్యటన పట్ల ఆసక్తి చూపలేదనీ అంటున్నారు. స్థానిక నేతలు ఎంపిక చేసిన వారు మాత్రమే జగన్ కు చేరువగా వెళ్లి ఆయనతో ఫొటోలు దిగారంటున్నారు. గతంలో ముద్దులతో మురిపించిన జగన్ ఈ సారి వరద బాధితుల పరామర్శ పర్యటనలో ఆలింగనాలకు పని చెప్పారు. ఇది చూసి నాడు ముద్దులు..నేడు ఆలింగనాలు తప్ప వాస్తవంగా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-change-his-style-witm-mingling-people-25-140724.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.