హాజరు కోసమే సభకు జగన్!?

Publish Date:Feb 11, 2026

Advertisement

ప్రతిపక్ష హోదా ఇస్తేనే  అసెంబ్లీకి వస్తానంటూ మంకుపట్టు పట్టి ఇంత కాలం అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన జగన్.. ఎట్టకేలకు తన పట్టు వీడి అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో ఆయన సభలో అధికారపక్షాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తారని అంతా భావించారు. అయితే  పరిశీలకులు  మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నది కేవలం హాజరు కోసమేననీ, హాజరు వేయించుకోవడం ద్వారా తన, తన పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వానికి ఎటువంటి ఇబ్బందీ కలగదన్న భావనతోనే ఆయన అసెంబ్లీకి హాజరవ్వడానికి నిర్ణయించుకున్నారని విశ్లేషించారు.

తీరా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. తన పార్టీ సభ్యులతో కలిసి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్న జగన్.. అసెంబ్లీలో తన పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కో సభ్యుడికీ ఒక్కో నిముషం అన్నట్లుగా కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు.  ఆ ఉన్న కాసేపూ కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణం అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తమ నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగానికి గౌరవమిచ్చి తమతమ స్థానాలలో కూర్చోవాలని తెలుగుదేశం కూటమి సభ్యులు పలుమార్లు కోరినా వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. వైసీపీ సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ఇంకా పూర్తి కాకుండానే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో  కల్తీ నెయ్యి అంశం, మెడికల్ కాలేజీల పీపీపీ అంశాలకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులూ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మిత్రమే సభకు హాజరయ్యారని రాజకీయవర్గాలలో చర్చ మొదలైంది.

 ఆరు నెలల గైర్హాజర్ నిబంధన పరిధిలోకి రాకుండా ఉండేందుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్పీకర్ అయ్యన్న పాత్రుడు  అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలోలా   అసెంబ్లీ అటెం డెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లియే అవకాశం , వైసీపీ సభ్యులకు లేకుండా పోయింది.  ఇప్పుడిక ఆ అవకాశం లేదు. అది పక్కన పెడితే.. సభలోకి అడుగుపెట్టడానికి ముందు కూడా అసెంబ్లీ ప్రాంగ ణంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.