మరోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు జగన్ నిర్ణయం.. రోజాకు ఉద్వాసనేనా?

Publish Date:Sep 10, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం ఆయన కొందరు మంత్రులను ఉద్దేశించిన నేరుగా, మరి కొందరిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన ఆగ్రహం, మంత్రి పదవులు పీకేస్తా జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరికలను  బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది.

ఆయన హెచ్చరికల అనంతరం కూడా కేబినెట్ మంత్రులలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మోస్ట్లీ నవంబర్ లో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనీ, ప్రస్తుత కేబినెట్ లో కనీసం అరడజను మందికి ఉద్వాసన తప్పదనీ కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజాకు తదుపరి పునర్వ్యవస్థీకరణలో అంటే నవంబర్ లో ఆమె పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఆమెకే కాకుండా మరో మహిళా మంత్రి విడదల రజనికి కూడా ఉద్వాసన తప్పకపోవచ్చునని అంటున్నారు. రోజాపై జిల్లాలోనే కాకుండా, మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆమె వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారనీ, ఇక మరో మహిళా మంత్రి విడదల రజనీ అయితే సామాజిక మాధ్యమంలో సొంత ప్రచారంపై పెడుతున్న శ్రద్ధ, పార్టీ వ్యవహారాలలోనూ, విపక్ష విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలోనూ చూపడం లేదన్నది జగన్ భావనగా చెబుతున్నాయి. అందుకే జగన్ ఆరు నెలల వ్యవధిలోనే తన మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు.

ఆరు నెలల కిందట జగన్ కొత్త టీమ్ ను ఎంపిక చేసిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూర్పు చేసిన సందర్భంగా ఈ కేబినెట్ ను రెండున్నర సంవత్సరాలు మాత్రమేననీ, రెండున్నర సంవత్సరాల అనంతరం కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుంటాననీ జగన్ విస్పష్టంగా చెప్పారు. అన్నట్లుగా సరిగ్గా రెండున్నర సంవత్సరాలకే కాకుండా మూడేళ్లు కావస్తుండగా జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే ఆయన ముందుగా చెప్పిన విధంగా మొత్తం కేబినెట్ ను మార్చేయలేదు.

కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించి కొత్తవారికి స్థానం కల్పించారు. ఈ కారణంగానే ఉద్వాసనకు గురైన మంత్రులలో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ 2.0 టీమ్ లో గట్టిగా మాట్లాడేవారు కానీ, విపక్ష విమర్శలను దీటుగా ఎదుర్కొనేవారు కానీ లేరన్న భావన సీఎం జగన్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ సతీమణి భారతిపై ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంగా కేబినెట్ సహచరులే కాదు.. పార్టీలో ఎవరూ కూడా దీటుగా స్పందించకపోవడంతో జగన్ లో అసహనం కట్టలు తెంచుకుందంటున్నారు.

ఆ కారణంగానే కేబినెట్ సహచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి నోరున్న మంత్రులకు చోటు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని నిర్ధారణ అయిన తరువాతనే కొడాలి నాని మళ్లీ తన గొంతు సవరించుకున్నారనీ, చంద్రబాబుపై, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పూర్వంలా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో పదవి కోల్పోయిన కొడాలి నానికి మలి పునర్వ్యవస్థీకరణలో పదవి గ్యారంటీ అని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.