పులివెందులలో జగన్ బస్టాండ్ కథ!

Publish Date:Aug 30, 2022

Advertisement

ఇంట గెలిచి.. రచ్చ గెలువు అనేది పెద్దలు చెప్పిన మాట. అంటే ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాత ఇతర వ్యవహారాలు చేస్తే మంచిదనేది దాని అర్థం. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా వినియోగించే వ్యంగ్యాస్త్రం ఇది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కే ఆయన మాటలు సరిగ్గా సరిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కొనసా...గుతున్న బస్టాండ్ నిర్మాణం కథ అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

నవరత్నాలంటారు.. సంక్షేమ పథకాలంటారు.. ఆంధ్రుల ప్రజా రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడతారు. అభివృద్ధి అంటారు.. స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం అని చెబుతారు.  అక్కచెల్లెమ్మలకు అంత చేస్తా ఇంత చేస్తా అంటూ గొప్పలు చెబుతారు. పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామంటారు. నోటికి వచ్చిన హామీ ఇచ్చేసి.. ఖజానా ఖాళీ చేసి ఆనక ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఓట్లేసిన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేస్తారు.  ఏపీకి తానేదో చేశాననే భ్రమలోనే కబుర్లు చెబుతుంటారు.

ఇంత చెప్పుకుంటున్న జగన్ తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్న పులివెందుల ప్రజలకు ఏమి చేశారనే ప్రశ్న వస్తే.. మాత్రం జనం నోరెళ్లబెట్టడమే సమాధానంగా ఉంటుంది. అందుకు పులివెందుల బస్టాండ్ ప్రత్యక్ష నిదర్శనం అంటారు. నిజానికి సీఎం సొంత నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎలా ఉండాలి? మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా కనిపించాలి. పులివెందులలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునే సౌకర్యం మాట దేవుడెరుగు.. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనట్లు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘ఉన్నదీ పోయే.. తెచ్చుకున్నదీ పోయే’ అనే తీరులో పులివెందులలో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ కట్టేస్తామంటూ గొప్పగా చెప్పిన జగన్ సర్కార్ ఉన్న పాత బస్టాండ్ ను   కూలగొట్టేసింది. ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినప్పటికీ కొత్త బస్టాండ్ ను నిర్మించలేదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు.. తీవ్రంగా అవస్థలు పడుతుండడంతో తాత్కాలికంగా తాటాకులతో చిన్న పందిరి వేసినా.. అది ఎండ నుంచి కానీ, వర్షం నుంచి కానీ ఏమాత్రం కాపాడలేకపోతోంది. ఏ కొంచెం గాలి వీచినా దాని టాప్ లేచిపోతోంది. దాంతో పాటు పాత భవనం కూలగొట్టిన బస్టాండ్ ఆవరణలో దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే.. వారి బాధలు వర్ణనాతీతం.  

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులలో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఒక డిజైన్ ను ప్రభుత్వం రెడీ చేసింది. ఆ డిజైన్ ఓ రంగుల కలలా, గ్రాఫిక్స్ మాయాజాలంలా రూపొందించింది. కానీ సీఎం అయి, మూడేళ్లయినా బస్టాండ్ నిర్మాణం అతీగతీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయినా.. సొంత నియోజకవర్గం ప్రజలకు బస్టాండ్ కూడా కట్టించలేని   జగన్ ఇక ఏపీకి రాజధాని నగరాన్ని అదీ ఒకటి కాదు మూడు ఎలా కట్టగలరు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని కోసం సిద్ధం చేసిన డిజైన్ ను ప్రతిపక్ష నేతగా జగన్, వైసీపీ నేతలు కూడా దాన్ని ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ అంటూ విమర్శించిన విషయం   తెలిసిందే. అయితే.. ఇప్పుడు పులివెందుల కొత్త బస్టాండ్ విషయంలో జగన్ చేసింది గ్రాఫిక్స్ మాయాజాలం కాక మరేమిటనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ డిజైన్ ను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంగానే భావించి, దాని నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ నెటిజన్లు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో పులివెందులలో తాటాకు బస్టాండే ప్రయాణీకులకు గతి అంటూ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది.

ఒక పక్కన పులివెందులలో పాత బస్టాండ్ కూలగొట్టి, తాటాకులతో వేసిన బస్టాండ్ ఆవరణను, మరో పక్కన ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించిన శాశ్వత బస్టాండ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియా షేర్ చేస్తూ ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో కుప్పం బస్టాండ్ ను చూసి అయినా జగన్ నేర్చుకోవాలని   హితవు పలుకుతున్నారు.   ప్రజా రాజధాని సంగతి దేవుడెరుగు.. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మించలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎస్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కు 175 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని జగన్ చెప్పడంలో అతి అనిపించడం లేదా? అంటున్నారు.

By
en-us Political News

  
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.