వినుకొండలో వాలబోతున్న ‘రాబందు’ జగన్!
Publish Date:Jul 18, 2024
Advertisement
రక్తం... రక్తం.. శవం.. శవం... ఎక్కడ? ఎక్కడ? అర్జెంటుగా రక్తం కనిపించాలి... అర్జెంటుగా శవం దొరకాలి? ఎలా.. ఎలా? ఒకసారి రక్తం, శవం అధికారాన్ని తెచ్చాయి.. రెండోసారి రక్తం గట్టెంకించలేదు.. ఎందుకంటే, అప్పుడు రక్తంతోపాటు శవం దొరకలేదు.. మొదట్లో తండ్రి శవాన్ని పక్కన పెట్టుకునే రాజకీయం నడిపాడు... ఆ తర్వాత శవాలు అయిపోయిన వారిని, తన తండ్రి చావు వల్ల హర్టయి చనిపోయినట్లు కలరింగ్ ఇచ్చేసి , వాళ్ళ కుటుంబాలను ఓదార్చుతున్నట్టు బిల్డప్ ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాడు.. ఆ తర్వాత ఐదేళ్ళపాటు అధికారం చెలాయించినప్పుడు ఈయన అండ్ ఈయన దండుపాళ్యం బ్యాచ్, ఎంత రక్తం పారించారో.. ఎంతమందిని శవాలను చేశారో... ఎన్నిశవాలను డోర్ డెలివరీ చేశారో....! ఈ రాజకీయ రాబందు జగన్‌కి రక్తమన్నా.. శవాలన్నా చెప్పలేనంత ప్రీతి. రాబందు ఎలాగైతే శవాల కోసం నిరంతరం వెతుకుతూ వుంటుందో, ఆ శవాన్ని పీక్కుతిని, ఎలా తన పబ్బం గడుపుకోవాలని అనుకుంటుందో... ఇప్పుడు జగన్ కూడా శవాల కోసం అన్వేషిస్తున్నాడు. జగన్ అన్వేషణ ఫలించింది.. ఒక శవం దొరికింది. ఆ శవం పేరు రషీద్.. లొకేషన్ వినుకొండ... జగన్ శవ రాజకీయం ప్రారంభమైపోయింది.. జగన్ అనే రాజకీయ రాబందు వినుకొండలో వాలబోతోంది. వినుకొండలో జిలానీ, రషీద్ అనే ఇద్దరు వ్యక్తులు ఎప్పటి నుంచో స్నేహితులు. ఇద్దరూ ఒక పేరుమోసిన రౌడీకి అనుచరులు. ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇద్దరూ కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఏఏ విషయాలు వున్నాయోగానీ, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. అవి ముదిరాయి. బద్ధ శత్రవులుగా మార్చాయి. ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళాయి. బుధవారం నాడు రషీద్ మీద జిలానీ కొడవలితో దాడి చేశాడు. దారుణంగా నరికి చంపాడు. ఆహా... పాపం ఆ రషీద్ శవమైపోయాడుగానీ, జగన్‌లో ఉత్సాహాన్ని బతికించాడు. జగన్ రంగంలోకి దిగేలా చేశాడు. అలా రషీద్ హత్యకు గురయ్యాడో లేదో.. ఇలా పిల్ల సజ్జల నాయకత్వంలోని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ రంగంలోకి దిగింది. తమ పార్టీ కార్యకర్త రషీద్‌ని టీడీపీ కార్యకర్త జిలానీ నరికి చంపాడంటూ రాద్దాంతం మొదలుపెట్టేసింది. బెంగళూరులో రెస్టు తీసుకుంటున్న జగన్ రాబందు కూడా వేగంగా ఎగురుకుంటూ వినుకొండకి బయల్దేరింది. శుక్రవారం నాడు రషీద్ ఇంటి దగ్గర వాలబోతోంది. ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శాపంలా తగిలాడు. ఇతడిని ఇలా ఇంకెంతకాలం భరించాలో ఏంటో!
http://www.teluguone.com/news/content/jagan-behaving-like-a-vulture-25-180995.html





