వైయస్ విజయమ్మ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి
Publish Date:Oct 6, 2012
Advertisement
జగన్‌బాబుపై కుట్రలు పన్ని జైలులో పెట్టారని శాపనార్ధాలు పెడుతున్న వై.ఎస్. విజయ లక్ష్మి జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టిడిపి పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై వివరాలు వెల్లడించాలని, యు.పి.ఎ. హయాంలో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన గుర్తు చేశారు. రూ. 60 కోట్ల బోఫోర్స్ అవినీతి కేసులో అర డజను మందితో రాజీనామా చేయించిన ఘనత ఎన్టీఆర్‌ది అని కూడా ఆయన గుర్తు చేశారు. కేంద్రాన్ని ప్రజల ఆస్తులు కాపాడండి అని తెలుగుదేశం పార్టీ కోరిందని, అందుకు విజయలక్ష్మి కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు అయ్యిందని అనడాన్ని ఖండించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేకమేడలా కూలే పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో విజయమ్మ చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెసు నాయకుల కాళ్లు నొప్పి పెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/jagan-assets-case-31-17942.html





