టికెట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి జగన్ సొమ్ములు వసూలు!

Publish Date:Dec 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగడం  ఖాయమని వైసీపీ రెబల్ ఎంపి  రఘురామకృష్ణం రాజు అన్నారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు. 

2024 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమన్నారు. .   రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూమూలుగా అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ చులకనగా చూస్తారనీ, వారికి ఇసుమంతైనా గౌరవం ఇవ్వరనీ, అయితే ముందస్తు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి కనుక  ఎమ్మెల్యేలకు ఇప్పుడు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు అన్నారు.  అంతే కాకుండా ఎన్నికల నిమిత్తం జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంత మొత్తం ఇవ్వాలని కోరుతున్నట్లు తన  వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కోరిన విధంగా సొమ్ము ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నారు.

సొమ్ము ముట్ట చెప్పి టికెట్లు తెచ్చుకున్నా గెలిచే అవకాశాలు లేవని ఎమ్మెల్యేలకు ఇప్పటికూ పూర్తిగా అర్ధం కావడమే కారణమన్నారు.  జగన్ రెడ్డి గృహ సారథులు పేరిట గృహ హింసకులను రంగంలోకి దింపుతున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ సర్కార్ వారికి అదనంగా మరో ఇద్దరు గృహ సారథులను నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓటును తొలగించేలా చేయడమే వీరి పని అని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం తగదని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సొంత సొమ్ముతో జరుపుకోవలసిన జన్మదిన వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము కేటాయించడమేమిటని ప్రశ్నించారు. 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.