జగనన్న వదిలిన బాణం రివర్స్!?

Publish Date:Nov 7, 2023

Advertisement

మనం వదిలిన బాణం.. మళ్లీ మనకే వచ్చి తగిలితే ఏమౌతుంది. ఇప్పుడు ఆదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో. సోమవారం (నవంబర్ 6) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..  అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారని.. కానీ వారు ముఖ్యమంత్రులు కాకూడనీ వ్యాఖ్యానించారు. అలాగే వైయస్ ఫ్యామిలీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఆమె తనదైన శైలిలో స్పందించారు. నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజే.. సంబంధం లేదు అన్న  సజ్జల రామకృష్ణారెడ్డి  ఈ రోజు ఏ సంబంధముందని నా గురించి మాట్లాడుతున్నారు..మేము అయితే సంబంధం లేదనే అనుకుంటున్నాం. కానీ వాళ్లు మాట్లాడుతున్నారంటే... మళ్లీ సంబంధం కలుపుకోవాలనుకొంటున్నారా?.. సంబంధముందనా? ఏమనుకోవాలి?   సజ్జల గారే సమాధానం చెప్పాలి.. అసలు కేసీఆర్  బహిరంగంగానే సింగిల్ రోడ్డు అయితే ఆంధ్ర, డబుల్ రోడ్డు అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా.. వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు.. దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జలగారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి సార్ అంటూ సాక్షాత్తూ సజ్జలకే వైయస్ షర్మిల తనదైన శైలిలో చురకలంటించారు. సజ్జల మాట్లాడితే.. జగన్ మాట్లాడినట్లే కదా అన్న విలేకరుల ప్రశ్నకు   ఎవరికైనా ఇదే సమాధానం అంటూ వైయస్ షర్మిల చాలా ఘాటుగా స్పందించారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో   వైరల్ అవుతున్నాయి. గాభరా పెడుతున్నాయి.  

నాడు వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  సోదరుడు   జగన్ కోసం పాదయాత్ర చేశారు.. ఆ తర్వాత  జగన్ అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆమె  అలుపెరగని పోరాటమే చేశారు.  జగన్ ముఖ్యమంత్రి కాగానే ..  సోదరిని   పక్కన పెట్టేశారని.. దీంతో ఆమె తన తల్లితో కలిసి పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి... వైయస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి.. తన రాజకీయం తాను చేసుకొంటున్న సంగతి తెలిసిందే. 

అయితే 2024, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయని.. ఈ ఎన్నికల వేళ  జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేసే వారు ఎవరనే ఓ సందేహం అయితే వైసీపీలో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 151 సీట్లు వచ్చాయంటే.. అందులో తల్లి విజయమ్మ,  సోదరి షర్మిల కష్టంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం ఉందనీ.. అయితే ఇప్పుడు జగన్ కు  తల్లి  విజయమ్మ కానీ..  సోదరి  షర్మిల కానీ ఆయన వెంట లేరని పార్టీ వర్గాలే అంటున్నాయి.

అదే సమయంలో  ఎన్నికల్లో  వైసీపీ  తరపున ప్రచారానికి జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు వెళ్లితే.. పార్టీకి పడేవి ఓట్లు కావు.. రాళ్లు అనే  చర్చ కూడా వైసీపీలోనే మొదలైందని అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి స్కెచ్ గీసినా.. ఇప్పటికే కోడి కత్తి గాటు, బాబాయి గోడ్డలి పోటు వ్యవహారం పార్టీ అధినేత  జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో.. లేని నొప్పులన్నీ లేచి వచ్చినట్లు అయిందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం కలిగించడానికి  విజయమ్మ,   షర్మిలల ఆవశ్యకత ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ తాజాగా సీఎం   జగన్‌పైన, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైన వైయస్ షర్మిల చేసిన కామెంట్స్‌తో.. పార్టీ విజయం తర్వాత సంగతి.. అసలు పార్టీ కోసం ప్రచారం చేసేవారెవరన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోందంటున్నారు. పైపెచ్చు షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగినా, ప్రచారం చేసినా మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కూడా వైసీపీలో కనిపిస్తోంది. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.