అమరావతి మునిగిపోతుంటే.. జగన్ ఎందుకు పర్యటించరు?

Publish Date:Aug 20, 2025

Advertisement

ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ .  ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాథ రాష్ట్రంలా మార్చారు. మూడు రాజధానులంటూ కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా.. విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ ప్యాలెస్ నిర్మిచారు. 151 స్థానాలతో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకోని విధంగా దిగజారిపోవడానికి అధికారంలో ఉండగా అనుసరించిన ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు.  నాడు అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతికి జై కొట్టిన జగన్.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేయగలిగినంతా చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను వేధించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేతపై అవమానక వ్యాఖ్యలు చేయించారు. అక్రమ కేసులో 52 రోజుల పాటు జైలుకు పంపారు.  సరే ఇవన్నీ పంటి బిగువున భరించి ఆగ్రహాన్ని పెదవి బిగింపులో దాచుకుని ఎన్నికల వేళ ప్రజలు తన సత్తా చాటి జగన్ కు ఘోరాతి ఘోరమైన పరాభవాన్ని, పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణం జోరందుకుంది. అయితే జగన్, ఆయన పార్టీ నేతలూ మాత్రం అమరావతిపై విషం కక్కడం మానలేదు. తాజా వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఫేక్ వీడియోలతో సోంత మీడియా, సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబాహుల్యంలో ఓ సందేహం వ్యక్తం అవుతున్నది. నిజంగానే అమరావతి మునిగిపోతుంటే.. అక్కడి ప్రజలకు అండగా నిలబడి పోరాడేందుకు తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటి జగన్ ఎందుకు పర్యటించడం లేదు అన్నదే ఆ సందేహం.  జగన్ అమరావతిలో ముంపునకు గురైన ప్రాంతాలు నిజంగా ఉంటే.. ఆయా ప్రాంతాలలో పర్యటించవచ్చు కదా.. గతంలో బుడమేరు వరద ముంపులో బెజవాడ చిక్కుకున్నప్పుడు పర్యటించారు కదా? ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నదేమిటి? అడ్డుకుంటున్నదెవరు? 

ఇక్కడే జగన్ తీరు,  అమరావతిపై వైసీపీ చేస్తున్న విమర్శలు నమ్మశక్యంగా లేవని జనం అంటున్నారు. పరిశీలకులు కూడా అమరావతి ముంపు అంటూ వైసీపీయులు చేస్తున్న రాద్ధాంతం అసత్య ప్రచార మేనని విశ్లేషిస్తున్నారు. నిజంగా అమరావతిలో ముందు ప్రాంతాలు ఉన్నట్లైతే.. జగన్ కచ్చితంగా పర్యటించేవారనీ, కానీ ఇప్పుడు పర్యటిస్తే అమరావతిలో వరద ముంపు కాకుండా, నిటారుగా నిలబడిన నిర్మాణాలు కనిపిస్తాయనీ తెలుసుకనుకనే ఫేక్ ప్రచారాలను నమ్ముకుని జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.