జగన్.. షర్మిల.. ఎవరికి వారుగా తండ్రి వైఎస్ కు నివాళులు
Publish Date:Jul 8, 2025
.webp)
Advertisement
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీని నడిపిస్తోంది. జగన్ షర్మిలల మధ్య ఉన్న విభేదాలు జరిగిన ఎన్నికల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జగన్ పై ఆ ఎన్నికల్లో షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీతను వెంటబెట్టుకొని బాబాయ్ హత్య గురించి ఎన్నికల్లో తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ఆ ఎన్నికల నుండి ఇద్దరు మధ్య రాజకీయ, కుటుంబ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలులలో జరిగే తండ్రి వైయస్ జయంతి వేడుకల్లోగాని, వర్ధంతి వేడుకల్లో గాని వేరువేరుగానే పాల్గొంటూ నివాళులర్పిస్తూ వస్తున్నారు.
మంగళవారం (జులై 8) జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలల్లోనూ ఇదే తీరున ఎవరికి వారుగా తండ్రికి నివాళులర్పించారు. వారి తల్లి విజయం మాత్రం ఇద్దరితో కలిసి ఘాట్లో నివాళులు అర్పించారు .ఉదయం 7:30 కు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, తల్లి విజయమ్మ, బంధువులు, కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులతో కలిసి ఉదయం 8 .45 గంటల నుంచి 9.54 గంటల వరకు నివాళులర్పించి ప్రార్థనలు చేసి జగన్ వెళ్ళిపోయారు.జగన్ వెళ్లిన తర్వాత ఆయన సోదరి షర్మిల వైయస్ ఘాట్ కు వచ్చి తండ్రికి నివాళులర్పించారు. తల్లి విజయమ్మ అటు జగన్ తోనూ ఆ తర్వాత షర్మిళ తోను నివాళులర్పించడం ఆమె లో భావోద్వేగాన్ని నింపింది.
http://www.teluguone.com/news/content/jagan-and-sharmila-pay-tributes-to-father-ysr-39-201507.html












