హే జగన్నాథా.. అవినీతి సొమ్ములోనూ వాటాల గొడవా?

Publish Date:Nov 4, 2024

Advertisement

ముందు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ తరువాత తన అధికార మదంతో కొట్లకు పడగలెత్తిన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అడ్డగోలు అక్రమ సంపాదనంతా తన కష్టార్జితమని నిస్సిగ్గుగా చెప్పుకోగలిగిన ధీశాలి కూడా ఆయనే.  2009 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఆస్తులు వందల రెట్లు ఎలా పెరిగాయన్నది చిదంబర రహస్యమే. స్వేదం చిందించి, కంపెనీలు పెట్టి ఆస్తులను కూడబెట్టానని చెప్పుకుంటున్న జగన్.. 2009 ఎన్నికలకు ముందు కేవలం పది లక్సల రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న వ్యక్తి 2024 నాటికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే. 

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వివరాల మేరకు ఆయన పేరుమీద సేవింగ్స్ అక్కౌంట్ లో  అప్పట్లో లక్షా 93 వేల 797 రూపాయలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య విజయలక్ష్మి సేవింగ్స్ అక్కౌంట్లో నాలుగు లక్షల 54 వేల 663 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఆమె పేరుపై  సెవింగ్స్ 40 లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది.  ఇంకా వైయస్ పేరు మీద షేర్ మార్కెట్ లో 20 లక్షల రూపాయలు,  ఆయన భార్య పేరు మీద 35 లక్షల 25 వేల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి.  అలాగే ఇద్దరి పేరు మీద  చెరొక అరకేజీ  అంటే మొత్తం కేజీ బంగారం ఉంది.  ఇవి కాక  కడప జిల్లా ఇడుపులపాయలో  39.52 సెంట్లు,   అర ఎకరం తక్కువ 40 ఎకరాల భూమి ఉంది. అలాగే పులివెందుల పట్టణం రాజారెడ్డి స్ట్రీట్ లో  83 గజాల స్థలం వుంది.   ఇది వైఎస్ 2009లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న ఆస్తులు. వైఎస్ కు అప్పట్లో కనీసం కారు కూడా లేదు.  

సరే 2004లో వైఎస్ సీఎం కా కముందు  ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆస్తి   కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే.  అయితే తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. 2011 లో కడప లోక్ సభ స్థానానికి జగన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో  ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో  ఆస్తి విలువ అక్షరాలా  365 కోట్లు. ఇక ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న ఆస్తి విలువ 41 కోట్ల రూపాయలు.  తండ్రి అధికారంలోకి  రాక ముందు అంటే 2004 కు ముందు  కేవలం  పది లక్షల లోపు ఆదాయం చూపిన వ్యక్తి  2011 నాటికి వందలకోట్లు  ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే కదా? తన వ్యాపార విజయ రహస్యం జగన్ దంపతులే వెల్లడించాలి. లేదా అక్రమాస్తుల కేసుల విచారణలో నిగ్గు తేలాలి. అది పక్కన పెడితే 13 ఏళ్ల కిందటే జగన్   43 వేల కోట్ల  ఆర్థిక నేరాలకు పాల్పడ్డారాని ఈడీ, సీబీఐలు కోర్టుకు తెలిపాయి. ఇప్పుడు అదిలక్ష కోట్లు  దాటేసింది.   ఇక జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క  మద్యం, మట్టి , మైనింగ్ ఇసుక  అక్రమ వసూళ్ళు  ఎంత ఉంటాయన్నది ఎవరి ఊహకు కూడా అందదు. 

అటువంటి జగన్ ఇప్పుడు చెల్లెలు షర్మిలతో ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారు. తనకు రాజకీయంగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది కనుక చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇచ్చేది లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. తండ్రి వైఎస్ బతికి ఉండగానే ఆస్తుల పంపకం జరిగిపోయిందని నమ్మబలుకుతున్న జగన్.. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులు తన కష్టార్జితం అని చెబుతున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం కుమారుడు జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఓ బహిరంగ లేఖలో విస్పష్టంగా ప్రకటించారు.  దీంతో  సొంత పత్రికలో తల్లీ చెల్లిపై వారి వ్యక్తత్వ హననానికి పాల్పడేలా కథనాలు. వారిద్దరూ చంద్రబాబు చెప్పినట్లల్లా చేస్తున్నారంటూ అభాండాలు.  

మొత్తంగా షర్మిలతో ఆస్తుల వివాదంలో జగన్ వాదన అబద్ధమన్నది సులువుగా అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలికి ఆస్తుల్లో వాటాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లి విజయమ్మ కూడా తన బహిరంగ లేఖ ద్వారా జగన్ దుర్మార్గాన్ని బట్టబయలు చేసేశారు. అయినా శత్రువుతో కుమ్మక్కు అంటూ తల్లి, చెల్లెలిపై విమర్శలు గుప్పిస్తూ జగన్ ఎవరిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. సొంత పత్రికలో ఏం రాసినా అడిగేవాళ్లు ఉండరన్నట్లుగా ఆయన మాటలు చేతలు ఉన్నాయని అంటున్నారు. అయినా  ఎనిమిది ఈడీ కేసులు, 11సీబీఐ కేసులు, 13 ఐటీ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వందల కోట్ల ఆస్తులను చెమటోడ్చి సంపాదించానంటే నమ్మెదేలా అని జనం అంటున్నారు. అయినా పిచ్చి  కాకపోతే ఆస్తే అవినీతి అయినప్పుడు నీతిగా పంచమని అడుగుతారేంటి?

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.