ఇద్దరూ ఇద్దరే.. డ‌బ్బులతో గెలిచేస్తారా? మనీ పాలి-ట్రిక్స్!

Publish Date:Apr 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ల  మధ్య, ఇద్దరూ తెలుగు ర్రాష్టాల ముఖ్యమంత్రులు అనేది తప్ప ఇంకేదైనా  సారుప్యత వుందా? అంటే నిన్నమొన్నటి వరకు అలాంటి సారుప్యతలు అంతగా కనిపించేవి కాకపోవచ్చును. కానీ, యాదృచ్చకమో ఏమో కానీ, ఒకే రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు, తమ మనసులోని మాటను ఖుల్లం ఖుల్లా బయట పెట్ట్టారు. ఇద్దరికిద్దరూ రాజకీయాలు అంటే, డబ్బు, అదొక వ్యాపారం, ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇంత రాబట్టాలి అనే ధోరణిలోనే మాట్లాడారు. ఈ విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకే విదంగా నడుస్తున్నాయనే విషయాన్ని ఆ ఇద్దరే స్వయంగా బయట పెట్టారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన రోజునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, పార్టీ సమన్వయ కర్తల సమావేశంలో తమ మనసులోని మాటను బయట పెట్టారు.  రాజకీయం అంటే డబ్బు. డబ్బే రాజకీయం అని, ఇంతవరకు ఏ రాజకీయా నాయకుడు బహిరంగంగా బయటకు చెప్పని విధంగా తెలుగు ముఖ్యమంత్రులు స్పష్టంగా దేశానికి చాటింపు వేసి మరీ చెప్పారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, కారణాలు ఏవైనా జాతీయ రాజకీయాలపై చాలా కాలంగా చాలా చాలా మాటలు మాట్లాడారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. అందుకోసం కొంత ప్రయత్నం చేశారు. అక్కడిక్కడికి వెళ్లి, వాళ్ళను వీళ్ళనూ కలిసి వచ్చారు. అయినా, ఫలితం లేక పోయిందో ఏమో, ఇప్పుడు ట్రాక్ మార్చారు, ఫ్రంట్లు, టెంట్లు కాదు, ప్రత్యాన్మాయ విధానాలు కావాలని ఉద్ఘోషించారు. అంతవరకూ బాగుంది. అయితే, అదే సమయంలో అందుకు కొనసాగింపుగా, ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తమకు ఆర్థిక స్థోమత పుష్కలంగా ఉందని, ఒకటికి రెండు సార్లు, కాదు, పదే పదే చెప్పు కొచ్చారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలంటే ఎన్ని వేల లక్షల  కోట్ల రూపాయలు కావాలో లెక్కలు చెప్పారు. పార్టీ బ్యాంక్ ఖాతాల్లో అంతకంటే ఎక్కువే సొమ్ములున్నాయని చెప్పు కొచ్చారు. అంటే డబ్బులుంటే చాలు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని అంటున్నారు. 

అయితే ఇక్కడ, ఇంకో తిరకాసు కూడా ఉందని అంటున్నారు. కేసీఆర్ తమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు అక్కడకు, ఇక్కడకు వెళ్లి వాళ్ళను వీళ్ళను కలిశారు. అయిన గుర్తింపు రాలేదు. ఢిల్లీలో ఓ పీఆర్వోను పెట్టుకున్నారు. కానీ, అదీ అంతగా వర్క్ అవుట్ అయినట్లు లేదు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్నాచితక పార్టీలు,  నాయకులను అయినా ఆకర్షించేందుకు, కేసీఆర్ డబ్బుల లెక్కలు అంత బిగ్గరగా చెప్పారని, తెరాస సీనియర్ నాయకుడు ఒకరు అనుమానం వ్యక్తపరిచారు.  

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన కేసీఆర్ కంటున్న పీఎం కుర్చీ కలలు కనడం లేదు కానీ, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఎంత ఈజీనో లెక్కల్లో చూపించారు. “అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో, ఎన్ని బటన్లు నొక్కాం, రూ. 1.37 లక్షల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేశాం. ఈ ఏడాది మరో రూ.55 వేల కోట్లు, వచ్చే సంవత్సరం మరో రూ.55 వేల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేస్తాం. అంటే మొత్తంగా రూ.2.50 లక్షల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేస్తున్నాం. ఇంత గొప్పగా చేసిన తర్వాత కూడా గతంలో వచ్చిన 151 సీట్లకు తగ్గ కూడదు. అసలు 151 మాత్రమే ఎందుకు, మొత్తానికి మొత్తంగా 175 సీట్లు మనకే ఎందుకు రాకూడదు”  అంటూ జగన్ రెడ్డి చేసిన ఎన్నికల వ్యాఖ్యానం, విస్మయం కలిగించింది. 

నిజమే కావచ్చును, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం భయంకరంగా పెరిగిన మాట వాస్తవం. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎన్ని వేల కోట్లు ఖర్చయ్యాయో ఏమో కానీ, ‘అత్యంత ధనిక ఎన్నిక’ గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అయితే, ఇలా ఎముకలు మెడలో వేసుకోవడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? అన్నదే ప్రశ్న.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.