ఎట్ హోం లో జగన్ ఎక్కడా కనిపించలేదేం?

Publish Date:Aug 16, 2024

Advertisement

పంద్రాగస్టు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ గురువారం సాయంత్రం తన నివాసమైన రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ పురస్కార గ్రహీతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం గైర్హాజరయ్యారు.

ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. అయినా జగన్ హాజరు కాకపోవడానికి కారణాలేమిటన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ గైర్హాజరుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించకుండా డుమ్మా కొట్టడానికి కారణం ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల హాజరు కావడమేనని అంటున్నారు. వీరిరువురినీ ఫేస్ చేసే ధైర్యం లేకే జగన్ ఎట్ హోం కార్యక్రమానికి ముఖం చాటేశారన్నది పరిశీలకుల విశ్లేషణ్. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే   ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు నారా లోకేష్‌, సిఎస్ నీరబ్ కుమార్, డిజిపి ద్వారకా తిరుమల రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్‌ ఠాకూర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అదే విధంగా రాష్టర  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు  హాజరయ్యారు.

అహ్లాదపూర్వక వాతావరణం జరిగిన ఈ విందుకు హాజరైన వారంతా ఎలాంటి అరమరికలూ లేకుండా  పరస్పరం పలకరించుకొని మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్ద వైఎస్ షర్మిలని ఆప్యాయంగా పలకరించారు.   ఈ కార్యక్రమం సుమారు గంటసేపు సాగింది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ విందుకు కనీసం ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా లేని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరయ్యారు. ఈ విందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిందో, వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఇచ్చిందో కాదు. ఏటా పంద్రాగస్టు నాడు సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందు.  పార్టీలూ, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ హాజరవ్వడం విధాయకం.

అయితే అటువంటి సంప్రదాయలు, ఆనవాయితీలను పట్టించుకోకుండా జగన్ గైర్హాజర్ కావడం ద్వారా తనను తాను తగ్గించుకున్నారు. తనను తాను అగౌరవ పరుచుకున్నారు. జగన్ తీరు చూస్తుంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తో సరిపడటం లేదంటూ కేసీఆర్ కూడా ఎట్ హోంను బహిష్కరించేవారు.  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించకపోవడంలో జగన్, కేసీఆర్ లు దొందూదొందేనని పరిశీలకులు అంటున్నారు. తమ తీరుద్వారా అదే నిజమని వీరిరువురూ పదే పదే రుజువు చేస్తున్నారు. 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.