ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో జగన్, చంద్రబాబు

Publish Date:Aug 15, 2022

Advertisement

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ ఇచ్చిన ఈ తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు.   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. ఈ ఇరువురూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత అరుదు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు హాజరైన కారణంగా జగన్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అటువంటిది గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి ఇరువురూ హాజరు కావడం సర్వత్రా ఆసక్తి నింపింది.

అయితే ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు పరస్పరం ఎదురు పడలేదు. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు.  కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు.  జగన్ దంపతులు గర్నవర్ దంపతులు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చున్నారు. చంద్రబాబు కాస్త దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంలో చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని ఒకే టేబుల్ దగ్గర కూర్చోవడంపై తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద చర్చ జరిగింది  

ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన  చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి కూడా నాని నిరాకరించిన సంగతి విదితమే. కాగా ఈ కార్యక్రమానికి ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు  హాజరయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ హరిచందన్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరించారు.  

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఏపీ గవర్నర్ రాజ్ భవన్ లో తేనేటీ విందు ఏర్పాటు చేశారు. కాగా, రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్న జగన్, చంద్రబాబు ఎట్ హోమ్ కు హాజరవడం. మూడేళ్ల తర్వాత ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సర్వత్రా ఆసక్తి రేపింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.