వస్తాడోస్తాడు...సారోస్తాడు...
Publish Date:Jan 9, 2013
Advertisement
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతీ సభలో, సమావేశంలో తప్పనిసరిగా వినిపించే మాటలు కొన్ని ఉన్నాయి. ‘జగన్ త్వరలోనే బయటికివస్తాడని,’ ‘ప్రజల కష్టాలు తీరుస్తాడని,’ ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే మూడు ముఖ్యమయిన వాక్యాలతో ఆపార్టీ నేతల ప్రసంగం మొదలయి, చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని, సిబిఐని తిట్టడంతో ముగుస్తుంటుంది. చంచల్ గూడా జైల్లోంచి బయటకి రాలేక నానకష్టాలు పడుతున్న జగన్ బయటకొచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని చెప్పడం ఎవరికయినా నవ్వు తెప్పిస్తుంది. అంతకంటే, జగన్ జైల్లో ఏవిదంగా భాదలు పడుతున్నాడో ప్రజలకి వివరించి చెప్పుకొంటే అతనిపట్ల ప్రజలలోకొంత సానుభూతినయినా ప్రోదిచేసే అవకాశం ఉండేది. గానీ, ప్రతీ సభ, సమావేశంలో ‘వస్తాడోస్తాడు...సారోస్తాడు...’అనే పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీని నవ్వుల పాలు చేస్తుంది తప్ప, ఒరిగేదేమి ఉండదు. ఇక ‘దివంగత నేత వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తాడనే’ అనే వాక్యం వినగానే, ప్రస్తుతము చంచల్ గూడా జైల్లో కిక్కిరిసిఉన్న ఐ.యే.యస్. ఆఫీసర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆడిటర్లూ, కోర్టులు, ఈ.డీ. జప్తులు వగైరావగైరాలన్నీమన కళ్ళముందు సినిమారీలు తిరిగినట్లు గిర్రున ఒకసారిగా తిరిగి, మళ్ళీ మరోసారి రాజన్న రాజ్యం....అదే జగనన్న రాజ్యం వస్తుందంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఐ.యే.యస్. ఆఫీసరు శ్రీలక్ష్మి తానూ వ్యక్తిగతంగా తప్పుచేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తానూ రాజన్నరాజ్యంలోఉన్నపాపానికి సమిష్టి తప్పు చేసి ఇలాగ జైలు పాలయేనని బోరున కోర్టులో విలపిస్తుంటే రాజన్నరాజ్యం తడాఖా ఎలాఉంటుందో అర్ధమవుతుంది. అటువంటి రాజన్నరాజ్యం మళ్ళీ అంటే అమ్మో! అంటారు జనం. ఇక చివరిగా చెప్పుకోవలసిన విషయం ఈ రోజు కర్నూలు పట్టణంలో విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. షరా మాములుగా, ఆమె ముందుగా ప్రజలకు ఆ మూడు పవిత్ర వాక్యాలు చెప్పుకొన్నాక, నేటి సర్వానర్ధాలకి చంద్రబాబు, కిరణ్ కుమారులే కారణమని తిట్టిపోయడంతో సభ ముగించేరు. అదృష్టవశాత్తూ మన రోశయ్యగారు కిరణ్ కుమారూడి చేతికి రాష్జ్త్రం అప్పజెప్పి తెలివిగా చెన్నై చెక్కేశారు. లేకపోతె కిరణ్ కుమారుడి పేరుకు బదులు ఆయన పేరు ఉండే ఆ తిట్లదండకంలో.
http://www.teluguone.com/news/content/jagan-24-20326.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





