నిరుద్యోగులతో జగన్ డేంజర్ గేమ్.. డీఎస్సీ చుట్టూ పొలిటికల్ ట్రాప్!

Publish Date:Jun 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ  విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకున్నాయి. దాదాపు 16వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ రిక్రూట్‌మెంట్   ఊరటనిచ్చిందనడంలో సందేహం లేదు. అయితే దీనిని  అభినందించాల్సింది పోయి..  వైసీపీ అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ కో దీని చుట్టూ కొత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. డీఎస్సీ పరీక్షల్లో విఫలమైన లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఉండే సహజమైన అసంతృప్తిని, నిరాశను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో ఉద్రిక్తతలు మరియు విభేదాలు సృష్టించేలా సాగుతున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్ నైజానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదైనా ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్టుల సంఖ్య ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. తాజా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో కేవలం 16,000 పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ పరీక్ష కోసం దాదాపు 4 నుండి 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. అంటే, సహజంగానే మిగిలిన నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పోటీలో విజయం సాధించలేకపోయారు. పగలు, రాత్రి కష్టపడి చదివి, తృటిలో ఉద్యోగం కోల్పోయిన ఆ నిరుద్యోగుల మనసుల్లో ఉండే బాధను, ఆవేదనను వైసీపీ అధినేత తన రాజకీయ లబ్ధి కోసం అస్త్రంగా మార్చుకుంటున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఒక తప్పుడు ప్రచారాన్ని నిరుద్యోగుల బుర్రల్లోకి  ఎక్కించడం ద్వారా, ప్రస్తుత ప్రభుత్వంపై  వ్యతిరేకతను సృష్టించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. 

వైసీపీ శ్రేణులు కేవలం మీడియా వేదికగా ఆరోపణలు చేయడమే కాకుండా..  ఉద్యోగాలు రాని అభ్యర్థులను ఒక పెద్ద ట్రాప్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాయి.  ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయాలని నిరుద్యోగులను వైసీపీ రెచ్చగొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా.. భవిష్యత్తులో  వైపీపీ  అధికారంలోకి వచ్చాక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మశక్యం కాని ఆశలు చూపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. జీవితంలో స్థిరపడాల్సిన యువతను ఇలా తప్పుడు కేసుల వైపు, రాజకీయ బురదజల్లుడు వైపు నడిపించడం అంటే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు.  

ఇక అందుబాటులో ఉన్నడేటాను బట్టి చూసే.. వైసీపీ నేత, ఆ పార్టీ చేస్తున్న   ఆరోపణలు  నిలబడటం లేదు.    నిజంగానే డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే, లేదా పేపర్ లీక్ లాంటివి నిజమై ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రతిపక్షం కోర్టుల ముందు గానీ, ప్రజల ముందు గానీ ఉంచాలి. కానీ..  వైసీపీ అనుకూల మీడియా,  ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ పని చేయడం లేదు.  ప్రభుత్వం ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులను, వారి ర్యాంకులను,  స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వివరాలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందరికీ అందుబాటులో ఉంచింది. దీనివల్ల వైసీపీ ఏ అభ్యర్థి పేరు ఎత్తి అన్యాయం జరిగిందని ప్రచారం చేసినా..  ఆ అభ్యర్థి అర్హత, అనర్హత నిముషాల్లో  ఆన్‌లైన్ డేటా ద్వారా నిరూపితమవుతోంది. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా  కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం నిరుద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. 

జగన్ రెడ్డి   ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయం భవిష్యత్తులో రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థకే  గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతిసారి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ  పూర్తయిన వెంటనే..  కేవలం రాజకీయ కారణాలతో నోటిఫికేషన్లను వివాదాస్పదం చేస్తూ, కోర్టుల చుట్టూ తిప్పితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే  ధైర్యం చేయదు. ఫలితంగా రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ  పూర్తిగా స్తంభించిపోయి నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.  

By
en-us Political News

  
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు.
వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే వ్యూహంతో సెలక్టర్లు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయడమే కాకుండా, ఆయనను జట్టు నుంచే తప్పించారు. అలాగే.. ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుతేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్‌ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.