ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్

Publish Date:Jul 16, 2022

Advertisement

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. శనివారం రాత్రి మోడీ అధ్యక్షతన సమవేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించింది.

ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడిగా, ఆ తరువాత 1993 నుంచి 1998 వరకూ కిషన్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న జగదీప్ దినకర్ 2019 జులై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం (జులై 19)తో ముగియనున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ఖరారు చేశారు. ఉప రాష్ట్ర పతి ఎన్నిక పోలింగ్  ( ఒక వేళ అవసరమైతే) ఆగస్టు 6న జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడుతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు విపక్షాలను సంప్రదించే అవకాశాలున్నాయని జేపీ నడ్డా తెలిపారు.  అయితే విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు ఆదివారం (జులై 17) సమావేశం కానున్నాయి.

రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విపక్ష నేతలంతా హాజరౌతారని భావిస్తున్నారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో జగదీప్ ధన్ కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది. ప్రస్తుత ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.